Bank Holidays: 2024 జనవరిలో బ్యాంకు సెలవులు ఇవే..!

జనవరి 2024లో బ్యాంకులకు సెలవులు (Bank Holidays) ఎప్పుడు ఉంటాయో కూడా తెలుసుకోవాలనుకుంటారు? 2024 సంవత్సరంలో జనవరి నెలలోనే 11 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి.

  • Written By:
  • Publish Date - December 23, 2023 / 12:55 PM IST

Bank Holidays: 2023 సంవత్సరం ముగిసేందుకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా జనవరి 2024లో బ్యాంకులకు సెలవులు (Bank Holidays) ఎప్పుడు ఉంటాయో కూడా తెలుసుకోవాలనుకుంటారు? కొత్త సంవత్సరం మొదటి నెలలోనే మీ బ్యాంకు పనికి ఇబ్బంది ఉండకుండా మీరు ముందుగానే సన్నాహాలు చేసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జనవరి నెల బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను చూస్తే దేశవ్యాప్తంగా ఏయే రోజులు, ఎక్కడెక్కడ బ్యాంకులకు సెలవులు ఉంటాయో తెలుసుకోవచ్చు.

RBI ప్రకారం.. 2024 సంవత్సరంలో జనవరి నెలలోనే 11 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే ప్రధాన పండుగల ప్రకారం బ్యాంకులకు సెలవులు ఉంటాయి. గణతంత్ర దినోత్సవం రోజున దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు మూసివేస్తారు. మొబైల్ బ్యాంకింగ్, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా పనిచేస్తాయి.

Also Read: White Paper – History : వైట్ పేపర్.. శ్వేతపత్రం.. వందేళ్ల చరిత్ర

2024 జనవరిలో బ్యాంకు సెలవులు ఇలా..!

– జనవరి 1- సోమవారం- నూతన సంవత్సరం- దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
– జనవరి 11- గురువారం- మిషనరీ డే- మిజోరం
– జనవరి 12- శుక్రవారం- స్వామి వివేకానంద జయంతి- బంగాల్
– జనవరి 13- రెండో శనివారం/లోహ్రి- దేశవ్యాప్తంగా సెలవు
– జనవరి 14- ఆదివారం- సంక్రాంతి- దేశవ్యాప్తంగా హాలిడే ఉంది.
– జనవరి 15- సోమవారం- పొంగల్, తిరువళ్లూర్ డే- తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో సెలవు
– జనవరి 16- మంగళవారం- తుసు పూజ- బంగాల్, అసోంలో సెలవు
– జనవరి 17- బుధవారం- గురు గోవింద్ సింగ్ జయంతి- పలు రాష్ట్రాల్లో సెలవు
– జనవరి 23- మంగళవారం- నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి- పలు రాష్ట్రాల్లో ఉంది.
– జనవరి 25- గురువారం- స్టేట్ డే- హిమాచల్ ప్రదేశ్
– జనవరి 26- శుక్రవారం- రిపబ్లిక్ డే- దేశవ్యాప్తంగా సెలవు
– జనవరి 27- నాలుగో శనివారం- దేశవ్యాప్తంగా సెలవు
– జనవరి 31- బుధవారం- మి-డామ్-మే-ఫి- అసోం

We’re now on WhatsApp. Click to Join.