హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పుడింగ్ మింక్ పబ్ కేసులో ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బుధవారం నాడే పుడింగ్ మింక్ పబ్ కేసులో టోనీ అనుచరులు ఇద్దరికీ పోలసులు నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 3వ తేదీ పుడింగ్ మింక్ పబ్ లో పోలసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో 4.5గ్రాముల కొకైన్ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ పబ్ లోకి ఎలా వచ్చిందన్న అంశపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పబ్ లో డ్రగ్స్ దొరికన ఘటనకు సంబందించి పబ్ నిర్వాహకుడు అభిషేక్ ఉప్పల, పబ్ మేనేజర్ అనిల్ కుమార్ లను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో పోలీసులు ఈ ఇద్దర్నీ నాలుగు రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు. అయితే పబ్ లోకి డ్రగ్స్ ఎలా వచ్చిందోనని తమకు తెలియదని పబ్ నిర్వాహకుడు అభిషేక్ ఉప్పల పోలీసుల విచారణలో చెప్పారు. ఫుడింగ్ మింక్ పబ్ పై దాడి చేసిన సమయంలో పబ్ లో ఉన్న 145మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మరో 105మంది కూడా అదే రోజు గుర్తించారు. వారి వివరాలను సేకరించారు పోలీసులు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు…ఆరా తీస్తున్నారు. అభిషేక్ ఉప్పలకు డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలున్నాయన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. అభిషేక్ ఫోన్లో ఈ ఇద్దరి ఫోన్ నెంబర్లను గుర్తించారు. దీంతో బుధవారం నాడు వీరికి పోలీసులు నోటిసులు పంపించారు. గురువారం ఉదయం అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
కాగా ఈ పబ్ లకు టోనీ అనుచరులు డ్రగ్స్ సప్లై చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. టోనీని మూడు నెలల క్రితం హైదరాబాద్ పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. టోనితోపాటు 22మందిని కూడా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.