IND vs BAN: నామమాత్రమైన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడింది. కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.11 ఏళ్ళ ఆసియా కప్ చరిత్రలో బాంగ్లాదేశ్ ఆటగాళ్లు మొదటిసారి టీమిండియాని ఓడించారు. ఈ మ్యాచ్ విజయం వారిలో ఉత్సాహాన్ని నింపింది. .
ఆసియా కప్ 2023 చివరి సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో భారత జట్టు 6 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారత్‌కు 266 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో భారత్ 259 పరుగులకే కుప్పకూలింది. టీమ్‌ఇండియా తరఫున శుభ్‌మన్ గిల్ చాలా ఖరీదైన సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో గిల్ వన్డేల్లో 5వ సెంచరీని నమోదు చేశాడు, కానీ గిల్ పోరాటం వృథా అయింది. ఉత్కంఠ పోరులో భారతదేశం ఓడిపోయింది.
బంగ్లాదేశ్ ఇచ్చిన 266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన భారత జట్టు తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ ఖాతా తెరవకుండానే తొలి ఓవర్ రెండో బంతికే పెవిలియన్ బాట పట్టాడు. బంగ్లాదేశ్ అరంగేట్రం ఆటగాడు తాంజిమ్ హసన్ అతడిని ఔట్ చేశాడు. దీంతర్వాత మూడో ఓవర్‌లో 5 పరుగుల స్కోరు వద్ద తిలక్ వర్మ అవుటయ్యాడు. అలా టాపార్డర్ కుప్పకూలిపోతున్న సమయంలో గిల్ మ్యాచ్ భారాన్ని మోశాడు. శుభ్‌మన్ గిల్ మరియు కేఎల్ రాహుల్ జోడీ జట్టుకుని ఆదుకునే ప్రయత్నం చేసింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖర్లో అక్షర్ పటేల్ 42 పరుగులతో టీమిండియా విజయానికి పునాది వేశాడు.34 బంతుల్లో 42 పరుగులతో 3 ఫోర్లు, 2సిక్సర్లతో సత్తాచాటాడు. అయితే.. చివరి రెండు ఓవర్లో 17 రన్స్ అవసరం అయ్యాయి. 19వ ఓవరల్ వేసిన ముస్తాఫిజుర్ రెండు బంతుల తేడాతో అక్షర్, శార్ధూల్ ఠాకూర్ ఇద్దరినీ పెవిలియన్ పంపాడు. 50వ ఓవర్ నాలుగో బంతికి షమీ(5) రనౌటయ్యాడు. దాంతో, బంగ్లా 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టులో కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 80 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. అతనితో పాటు తౌహీద్ హృదయ్ వన్డే కెరీర్‌లో 5వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. తౌహీద్ 54 పరుగులు చేసి ఔట్ కాగా.. భారత జట్టులో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు, మహ్మద్ షమీ 2 వికెట్లు తీశారు.
Also Read: Big Ticket : అబుదాబి వీక్లీ డ్రాలో 22 లక్షలు గెలుచుకున్న హైదరాబాద్ డ్రైవర్