కోవిడ్ ధాటికి పాన్ ఇండియా సినిమాలే వాయిదాల బాట పడుతుంటే.. తగ్గేదేలే అంటూ టాలీవుడ్ కింగ్ నాగార్జున తన సినిమా బంగార్రాజు రిలీజ్ డేట్ ను ప్రకటించాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు తెలిపాడు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. సినిమా పండుగ లాంటి సినిమా. షూటింగ్ మొదలు పెట్టినప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాం. అధికారికంగా ఎందుకు ప్రకటించలేదంటే.. మేము ఆలస్యంగా ఆగస్టు చివరి వారంలో షూటింగ్ మొదలుపెట్టాం. సంక్రాంతి పండుగకు సినిమా పూర్తి అవుతుందా? లేదా అనే సందేహంలో ఉన్నాం. సంక్రాంతి పండుగకు ఎన్ని సినిమాలు విడుదల అయినా ప్రేక్షకులు చూస్తారని, గతంలో సంక్రాంతి కానుగా విడుదల అయిన సొగ్గాడే చిన్నినాయన మంచి వసూళ్లు సాధించిందని నాగార్జున గుర్తు చేశారు.
Sankranthi race : సంక్రాంతి బరిలోకి ‘‘బంగార్రాజు’’ వచ్చేశాడు!

Bangarraju