Bandi Open Letter:జైలు నుండి బయటకు రాగానే కేసీఆర్ కు బహిరంగలేఖ రాసిన బండి సంజయ్

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ బహిరంగ లేఖ రాశారు. తనని జైలుకు పంపినందుకు కేసీఆర్ సంకలు గుద్దుకున్నారని, కానీ తనకు, బీజేపీ కార్యకర్తలకు జైళ్లు కొత్తకాదని సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ బహిరంగ లేఖ రాశారు. తనని జైలుకు పంపినందుకు కేసీఆర్ సంకలు గుద్దుకున్నారని, కానీ తనకు, బీజేపీ కార్యకర్తలకు జైళ్లు కొత్తకాదని సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

ఇప్పటివరకు తాను 9సార్లు జైలుకి వెళ్లానని, కేసీఆర్ లాగా తాను చీటర్ కాదని, తాను దొంగతనం చేసో, లంగతనం చేసో జైలుకు పోలేదని, తాను జైలుకు పోయింది ఉద్యోగుల,
ఉఫాధ్యాయుల కోసమని సంజయ్ తెలిపారు.

తాను జైలుకి వెళ్లినందుకు కేసీఆర్ సంబరపడ్డా తానేమీ బాధపడనని, కానీ తాను జైలుకు వెళ్లినందుకు ఉద్యోగ, ఉపాధ్యాయులు బాధపడుతున్నరని సంజయ్ తెలిపారు.

317 జీవోను సవరించాలని, లేనిపక్షంలో కేసీఆర్ సంగతి చూస్తానని సంజయ్ హెచ్చరించారు. కేసీఆర్ సీనియర్లకు, జూనియర్లకు కొట్లాట పెడుతున్నాడని, ఆ జీవోను సవరించి విడో, దివ్యాంగులకు, స్పౌజ్ లకు అవకాశం కల్పించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులతో చర్చలు జరిపి న్యాయం చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.

తమ ఆఫీస్ ను ధ్వంసంచేసి, కార్యకర్తల కాళ్లు, చేతులు విరగొట్టారని, మహిళా కార్యకర్తలపై అత్యాచార యత్నం చేశారని సంజయ్ ఆరోపించారు. 317 జీవో సవరించేదాకా కొట్లాడతామని, ఇప్పటికైనా ఉద్యోగులు స్పందించాలని లేకపోతే తమ జీవితాలు నాశనమైతయని సంజయ్ తెలిపారు.

తాను జైల్లో ఉంటె బయటకి రావాలని తెలంగాణ సమాజం కోరుకుందని, కేసీఆర్ జైలుకెళ్తే బయటకి రావొద్దని తెలంగాణ ప్రజలు కోరుకుంటారని సంజయ్ తెలిపారు. బీజేపీ ఇకపై వీరోచితంగా పోరాడుతుందని, కార్యకర్తల సత్తా చూపిస్తామని సంజయ్ తెలిపారు.