Site icon HashtagU Telugu

Bandi Sanjay: బీజేపీ కార్యకర్తలకు రుణపడి ఉంటా, గెలుపుపై బండి సంజయ్ రియాక్షన్

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: పార్లమెంట్ ఎన్నికల సంగ్రామంలో గౌరవ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఇంతటి చారిత్రత్మాక ఘన విజయాన్ని అందించి, మరోమారు పార్లమెంట్ సభ్యుడిగా ఆశీర్వదించినందుకు బండి సంజయ్ కరినగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలందరికి ధన్యావాదాలు తెలిపారు. కుటుంబాలను వదిలి తమ ఉద్యోగ, వ్యాపారలను పక్కనబెట్టి…కమల విజయ వికాసం కోసం అహర్నిశలు కాషాయ దళ సైనికులు శ్రమించారని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.  భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మద్దతుదారులకు రుణ పడి ఉంటానని, ఈ ఘన విజయం మోడీ, నడ్డా, అమిత్ షా నేతృత్వంలోని దశాబ్దకాల అభివృద్ధి సంక్షేమానికి బహుమానం అని బండి సంజయ్ అన్నారు.

ఎల్లప్పుడూ మార్గదర్శనం చేస్తూ కార్యకర్తగా నా కర్తవ్యాన్ని ప్రోత్సహిస్తున్న వివిధ క్షేత్రాల పెద్దలకు, కార్యకర్తలకు  ధన్యవాదాలు అంటూ బండి సంజయ్ ఎమోషన్ అయ్యారు. అందరి సహాయ సహకారాలతో కరినగర్ పార్లమెంటరీ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా నిబద్దతతో కృషి చేస్తానని బండి సంజయ్ అన్నారు.