Site icon HashtagU Telugu

BRS Party: బండి సంజయ్ వీరాభిమాని బీఆర్ఎస్ లో చేరిక

Bandisnjay Ttd

Bandisnjay Ttd

BRS Party: ప్రజల పట్ల ప్రేమకు చిహ్నం గులాబీ జెండా అని..కెసిఆర్ ముఖ్యమంత్రిగా లేని తెలంగాణను ప్రజలు ఊహించికొరని.. అసత్య ప్రచారాలు నమ్మవద్దని… ప్రజలంతా కెసిఆర్ కు ఓటేసెందుకు సిద్ధమయ్యారని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో స్థానిక పద్మనాయక ఫంక్షన్ హాల్ లో కార్యకర్తలు, బూత్ ఇంచార్జీ లతో సమావేశం ఏర్పాటు చేయగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మంత్రి గంగుల హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ప్రజలంతా కెసిఆర్ కు ఓటేసేందుకు సిద్ధమయ్యారని..కెసిఆర్ ఆలోచనలను ముందు చూపును ప్రతీ కార్యకర్త వివరించాలని కోరారు.

కాగా నగరంలోని 32వ డివిజన్ కట్ట రాంపూర్ కు చెందిన బండి సంజయ్ వీరాభిమాని వెంకటేష్ మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు. సంజయ్ పై ఉన్న అభిమానంతో తన చేతిపై సంజయ్ పచ్చ బొట్టు కొట్టిచుకునన్నని అయినా నా లాంటి వాళ్ళను పట్టించుకునే పరిస్థితిలో సంజయ్ లేదని అన్నారు. కేవలం యువతను రెచ్చగొట్టి ఓట్లు దండుకుని అవసరం తీరాక వదిలేయడం సంజయ్ నైజం అని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. వెంకటేష్ తో పాటు యువకులు నరేందర్, మహేష్, ప్రవీణ్ తో పలువురు పార్టీలో చేరారు.