Karimnagar: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కరీంనగర్ రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నీటిపాలైంది. ఈ మేరకు కరీంనగర్ రైతుల్ని పరామర్శించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నష్టపోయిన పంటపొలాలను పరిశీలించారు. కరీంనగర్ పరధిలో కేశవపట్నంలో కల్వల ప్రాజెక్ట్, వీనవంక మండలం కనపర్తి గ్రామం, చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం మోతె బ్రిడ్జి, ఓన్నారంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు . ఈ సందర్భంగ పంట నష్టం, ఆస్తి, పశు నష్టం జరిగిన ప్రాంతాలలో పర్యటించి, బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితులకు హామీ ఇచ్చారు బండి. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. పోయినసారి వరదలొచ్చి నష్టపోయిన రైతులకు ఇస్తానన్న సాయానికే ఇప్పటికీ దిక్కులేదని అధికార పార్టీపై మండిపడ్డారు. కేసీఆర్ ఇప్పటికైనా స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి రైతులను ఆదుకోవాలి. పంట నష్టపోయిన ప్రతి రైతులకు ఎకరాకు 20 వేల చొప్పున సాయం చేయాలి. యుద్ద ప్రాతిపదికన సమగ్ర పంటల బీమా పథకాన్ని ప్రకటించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Also Read: Chandrababu: సీమ సాగునీటి ప్రాజెక్టులపై CBN ప్రజెంటేషన్