బిజెపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న అనంతరం బండి సంజయ్ ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా కలిసిన విషయం తెలిసిందే. తెలంగాణలోని పరిస్థితులపై బండి సంజయ్ తో మిత్ షా చర్చించారు. మరో మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలని బండి సంజయ్ కు అమిత్ షా చెప్పారు. అయితే ఇవాళ బండి కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బండి సంజయ్ ట్విట్టర్ లో ఫొటోలు పోస్ట్ చేశారు. నరేంద్ర మోడీని కలిసిన ఈ రోజు మర్చిపోలేనిదని పేర్కొన్నారు.
మోడీ తన కుటుంబం కోసం కేటాయించిన ప్రతి క్షణాన్ని తన జీవితకాలం పాటు ఓ బహుమతిగా భావిస్తూనే ఉంటానని తెలిపారు. ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా శుక్రవారం ఉదయం బీజేపీ కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం ఢిల్లీ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి బండి సంజయ్ చేరుకుంటారు. ఇటీవలే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బండి సంజయ్ కుమార్ ఆగస్టు 4న న్యూఢిల్లీలో తన కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇటీవల జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదగడానికి ముందు, సంజయ్ కుమార్ రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడిగా మూడేళ్లకు పైగా నాయకత్వం వహించారు. కొత్త పదవిలో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, సంజయ్ కుమార్ మధ్యాహ్నం ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు తిరిగి వచ్చి శంషాబాద్‌లో బిజెపి కార్యకర్తలు, అతని మద్దతుదారుల సమావేశంలో ప్రసంగిస్తారు, తరువాత తన స్వగ్రామం కరీంనగర్‌కు వెళతారు.
Also Read: Sanjay Dutt: బాలీవుడ్ మున్నాభాయ్ కు భలే డిమాండ్, 60 రోజులకే 15 కోట్లు రెమ్యునరేషన్