Site icon HashtagU Telugu

Chandrayaan-3 : చంద్రమండలంలో దందా ఎట్లా చేయాలనీ కేసీఆర్ ఆలోచిస్తున్నాడు – బండి సంజయ్

Bandi Sanjay Shocking Comments On CM KCR

Bandi Sanjay Shocking Comments On CM KCR

చంద్రయాన్-3 (Chandrayaan-3) సక్సెస్ అయ్యిందని దేశం మొత్తం సంబరాలు చేసుకుంటుంటే.. కేసీఅర్ (CM KCR) చంద్రమండలంలో దందా ఎట్లా చేయాలి అనుకుంటాడు అని బండి సంజయ్ అన్నారు. శనివారం సోషల్ మీడియా వాలంటీర్లతో బండి సంజయ్ (Bandi Sanjay) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ కోడుకు కాకుంటే కేటీఆర్ ని ఎవరు పట్టించుకేవారే కాదని , కేటీఆర్ భాష, అహంకారం చూసి వాళ్ళ పార్టీ వాళ్ళే సిగ్గుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కడ లేదు అందుకే వాళ్లని అరెస్టు చేయరు.. బీజేపీ వాళ్ళనే అరెస్టు చేస్తారు అని బండి సంజయ్ అన్నారు. పేదలు-హిందుత్వం అనేదే తన పంథా అని స్పష్టం చేశారు.

తెలంగాణ లో రాబోయేది బిజెపి సర్కారే అని , ఈసారి బీజేపీ (BJP) అధికారంలోకి రాకపోతే తమ కార్యకర్తలను బతకనివ్వరని బండి సంజయ్ అన్నారు. బీజేపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచే కుట్ర జరుగుతోందని సంజయ్ ఆరోపించారు. “నాపై అవినీతి ఆరోపణలు చేసి పార్టీని దెబ్బతీసే కుట్ర చేశారు. నా నిజాయతీ, నిబద్ధతను కాపాడుతోంది సోషల్ మీడియానే. మీడియా సంస్థలు కేసీఆర్ గుప్పిట్లో ఉన్నాయి. వచ్చే ఎన్నికలకు సంబంధించి బీజేపీ వార్తలు రాకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా జనంలోకి వెళదాం” అంటూ పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLA) ఇతర పార్టీలకు వెళ్తారని భయంలోనే టిక్కెట్లు ప్రకటించిండు.. కేసిఆర్ ఎలక్షన్ వచ్చే సరికి సగం మందికి టిక్కెట్లు ఇవ్వడు అని బండి సంజయ్ ఆరోపించారు. గెలిచే అభ్యర్థులకు పైసలు పంచుతాడు కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కూడా పంచుతాడు అని బండి సంజయ్ అన్నారు. చంద్రయాన్-3 సక్సెస్ అయ్యిందని దేశం మొత్తం సంతోష పడితే.. కేసీఅర్ చంద్రమండలంలో దందా ఎట్లా చేయాలి అనుకుంటాడు అని ఆయన వ్యాఖ్యనించారు.