Bandi Sanjay On Gaddar : బరాబర్ గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వం – బండి సంజయ్

Bandi Sanjay On Gaddar : గద్దర్ కి అవార్డు ఎలా ఇస్తాం అని ప్రశ్నించారు. ఆయన భావాజాలం ఏంటి..? ఎందరో బీజేపీ నేతలను చంపిన వ్యక్తుల్లో గద్దర్ ఒకరు

Published By: HashtagU Telugu Desk
Bandisanjay Gaddar

Bandisanjay Gaddar

గద్దర్ (Gaddar) కు బరాబర్ పద్మశ్రీ ఇవ్వం అని.. కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay ) సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డులపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ. గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వమని బండి సంజయ్ తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన పేర్లను కేంద్రం అర్హతల ఆధారంగా పరిశీలించి అవార్డులు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

Nabha Natesh : కెమెరా ముందే అన్ని విప్పేసిన రామ్ హీరోయిన్

గద్దర్ కి అవార్డు ఎలా ఇస్తాం అని ప్రశ్నించారు. ఆయన భావాజాలం ఏంటి..? ఎందరో బీజేపీ నేతలను చంపిన వ్యక్తుల్లో గద్దర్ ఒకరు. బరాబర్ ఆయనకు పద్మ అవార్డు ఇవ్వం అని కుండబద్దలు కొట్టారు బండి సంజయ్. మా కార్యకర్తలను చంపి పాటలు పాడిన వ్యక్తి గద్దర్.. భయపడే ప్రశక్తే లేదు. వంద మంది భారతామాతాకి జై అని ఆందోళన చేస్తుంటే.. నక్సల్స్ భావాజాలం ఉన్న గద్దర్ కి పద్మ అవార్డు పేరు ఏవిధంగా పంపుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇదే సమయంలో బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పద్మ అవార్డులు ఇవ్వడంలో కేంద్రం వివక్ష చూపించిందని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అర్హులకే అవార్డులు అందజేస్తుందని, అవార్డుల విషయంలో ఏ రాజకీయ చర్చకూ తావు లేదని వ్యాఖ్యానించారు.

  Last Updated: 27 Jan 2025, 01:39 PM IST