Site icon HashtagU Telugu

Bandi Sanjay: తెలంగాణ ఖజనా ఖాళీ అయ్యింది.. జీతాలు ఇవ్వడమే గగనం

Bandi Sanjay Shocking Comments On CM KCR

Bandi Sanjay Shocking Comments On CM KCR

Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కీలక నేతలతో బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. అన్ని సర్వే నివేదికలు ఇవే చెబుతున్నాయి. బీజేపీ గెలుపులో ప్రధాన భూమిక మీదే. పోలింగ్ నాటికి ప్రతి ఓటర్ ను 7 సార్లు కలవాలి. పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ద్రుష్టి సారించాలి అని అన్నారు.

‘‘కరీంనగర్ లో సర్వే చేస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈసారి బీజేపీ గెలవాలని కోరుకుంటోంది. ఎందుకంటే కేంద్రంలో మోదీయే ఉండాలని భావిస్తున్నారు. దీనికితోడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రోడ్ల నిర్మాణాానికి అత్యధిక నిధులు తెచ్చింది నేనే. ఈ విషయాన్ని ప్రజల్లో చర్చ ఉంది’’ అని బండి అన్నారు.

‘‘ఇక కాంగ్రెస్ విషయానికొస్తే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఖజానా ఖాళీ అయ్యింది. ఎన్నికల తరువాత ఉద్యోగులకు జీతాలివ్వడమే గగనం కాబోతోంది. అప్పులకు వడ్డీ కట్టే పరిస్థితి లేదు. వీటితోపాటు ఎన్నికల హామీలు అమలు పెద్ద ఎత్తున నిధులు చాలా అవసరం. మోదీ ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే తెలంగాణకు అవసరమైన నిధులు రాబట్టుకునే అవకాశం ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ముఖ్యంగా 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాలను ఊరూరా ప్రస్తావించండి. బండి సంజయ్ ను గెలిపించాక మీ కోసం కొట్లాడిండు. వందల కేసులు పెట్టినా, జైలుకు పోయినా వెరవలేదు. పోరాడిండు బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావాలనుకున్నడు… కానీ దురద్రుష్టవశాత్తు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈసారి సంజయ్ ను భారీ మెజారిటీతో గెలిపించి పోరాడే నాయకులకు అండగా ఉంటామనే సంకేతాలను పంపాలని కోరండి’’ బండి సంజయ్ అన్నారు.