Bandi Letter To KCR : ‘కేసీఆర్’ కు ‘బండి సంజయ్’ బహిరంగ లేఖ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు

  • Written By:
  • Publish Date - March 24, 2022 / 06:29 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.దేశ ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ రాసిన లేఖలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా అనేక అవాస్తవాలున్నాయని ఆరోపించారు. కేసీఆర్ వి అబద్ధాలేనని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆధారాలతో సహా తేల్చారన్నారు బండి సంజయ్.వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి.. లేనిపక్షంలో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్ సహా అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రం బియ్యం సేకరిస్తుందే తప్ప, ధాన్యం సేకరించడం లేదని లేఖలో పేర్కొన్నారు. కేంద్రం యాసంగిలో వరి ధాన్యం కొనబోమన్నది అబద్ధం. వానాకాలం మాదిరిగానే యాసంగిలోనూ సేకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ధాన్యం సేకరణలో పెద్ద కుంభకోణం దాగి ఉంది. మిల్లర్లతో కుమ్మక్కై రేషన్ బియ్యం రీ సైక్లింగ్, లేని పంటను లెక్కల్లో చూపడం, పక్క రాష్ట్రాల్లోని బియ్యాన్ని తెచ్చి అమ్మినట్లు సమాచారముందని తెలిపారు బండి సంజయ్. టీఆర్ఎస్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే రైతులు పండించిన ధాన్యాన్ని, ప్రతీ గింజను కొనుగోలు చేయాలి. రైతుల జీవితాలతో రాజకీయం చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని… రైతులకు అండగా ఉద్యమిస్తుందని కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు బండి సంజయ్.