Site icon HashtagU Telugu

Ambedkar Statue; డా: బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత కేసీఆర్ కు లేదు

Ambedkar Statue

Ambedkar Statue

Ambedkar Statue: భారత రాజ్యాంగ నిర్మాత డా: బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్బంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 125 అడుగుల ఈ భారీ విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డుకెక్కింది. అయితే విగ్రహ నిర్మాణంలో అత్యంత జాప్యం జరిగిందంటూ మండిపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్. ఒకానొక సమయంలో విగ్రహ పనులు ఎక్కడికక్కడ నిలిపి వేశారని వ్యాఖ్యానించారు బండి. అంబేడ్కర్ జయంతి సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ లో మాట్లాడారు బండి సంజయ్.

మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ… అంబేడ్కర్ ని సీఎం కేసీఆర్ గౌరవించిన పాపాన పోలేదు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అంబేడ్కర్ గారికి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొన లేదు. కేసీఆర్ దళితులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేశారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ మొట్టమొదటిగా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేశాడు. ఈ రోజు హైదరాబాద్ లో 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణపై బండి కీలక వ్యాఖ్యలు చేశారు. విగ్రహం మొదలు పెట్టి, ఒక సమయంలో పనులు ఆగిపోయాయని, బీజేపీ రంగంలోకి దిగి వార్నింగ్ ఇస్తేనే విగ్రహం పూర్తయిందంటూ విమర్శించారు. అదేవిధంగా అంబేడ్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అవమానించింది. అంబేడ్కర్ గారు 370 ఆర్టికల్ ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ కారణంగా ఆయనను ఓడించి రాజ్యాంగాన్ని అవమానించిందంటూ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు.

అంబేడ్కర్ ఆశయాల మేరకు బీజేపీ పని చేస్తుందన్నారు బండి సంజయ్. మోడీ పాలనలో దళితులు సంతోషంగా ఉన్నారు. మోడీ పథకాలు దళితులకు అందుతున్నాయి. అందుకే మోడీ పాలనను కోరుకుంటున్నారు. అంబేడ్కర్ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయ పబ్బం గడుపుతుందని విమర్శించారు. ఈ రోజు కెసిఆర్ ఆ మహానుభావుడి విగ్రహ ఆవిష్కరణ చేసే అర్హత లేదని అభిప్రాయపడ్డారు బండి. అంబేడ్కర్ అంటే గౌరవం లేని ముఖ్యమంత్రి కెసిఆర్ అంటూ నిప్పులు చెరిగారు.

Read More: Shaakuntalam Review: సమంత ‘శాకుంతలం’ రివ్యూ.. సినిమా హిట్టా, ఫట్టా?