Site icon HashtagU Telugu

Bandi Sanjay : సుద్దపూస ఇప్పుడేమంటాడో.. కేటీఆర్‌కు బండి సంజయ్‌ కౌంటర్‌

Bandi Sanjay Ktr

Bandi Sanjay Ktr

Bandi Sanjay : హైదరాబాద్ శివారుల్లోని జన్వాడ రిజర్వ్ కాలనీలో రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీపై సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. పార్టీ గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం, ఈ వీఐపీల రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగినట్టు తేలడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పార్టీ జరుగుతున్న సమయంలో డీజే సౌండ్స్‌ కారణంగా స్థానికులు పోలీసులు సమాచారమందించారు. అక్కడ చేరుకున్న పోలీసులు, విదేశీ మద్యం , డ్రగ్స్‌ను సీజ్ చేసి, రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఈ ఘటనతో సంబంధించి మరింత సమాచారం కోసం విచారణ కొనసాగుతోంది.

Diwali : దీపావ‌ళి రోజున పెరుగుతో స్నానం చేస్తే ఏంజరుగుతుందో తెలుసా..?

అయితే… కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కేటీఆర్ పైన విమర్శలు చేస్తూ, బామ్మర్ది ఫాంహౌజ్‌లో జరిగిన రేవ్ పార్టీపై స్పందించారు. “సుద్దపూస కేటీఆర్ ఇప్పుడు ఏమంటాడో?” అంటూ తీవ్ర విమర్శలు చేశారు. బండి సంజయ్, ఆ పార్టీకి సంబంధించి డ్రగ్స్ వినియోగానికి ప్రాధమిక గుర్తింపు దొరికినందున, ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, “డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా, సుద్దపూస డ్రగ్స్‌ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో? ” అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

అటు, “సమాజాన్ని భ్రష్టు పట్టించే డ్రగ్స్ పై ప్రభుత్వం ఎందుకు రాజీ పడుతోంది?” అని ప్రశ్నించారు. అలాగే, “సమగ్ర విచారణ జరిపి, ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న ఉన్నత నాయకులందరిని అరెస్ట్ చేయాలి” అని డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానంగా ఉండాలని, ఈ వ్యవహారంలో న్యాయ చర్యలు చేపట్టాలని కూడా బండి సంజయ్ హెచ్చరించారు. ఈ పరిణామాలతో, తెలంగాణలో డ్రగ్స్ వినియోగం పై చర్చలు మళ్లీ మొదలయ్యాయి, ప్రభుత్వం , హోంశాఖ చర్యలను నిరీక్షిస్తున్నది.

అయితే.. ఈ రేవ్‌ పార్టీకి మొత్తం 35 మంది హాజరైనట్లు తెలుస్తోంది. అలాగే తన ఫామ్‌హౌస్‌ లో ఈ రేవ్ పార్టీ నిర్వహించిన రాజ్‌పాకాల ముందుగా ఎలాంటి అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు ఆయనపై ఎక్సైజ్ యాక్ట్‌కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఇక ఈ పార్టీలో 10 లీటర్లకు పైగా అనుమతి లేని విదేశీ మద్యం కూడా లభించినట్లు పోలీసులు చెబుతున్నారు.

Cyber Fraud : అధిక వడ్డీ పేరుతో ఏలూరులో ఘరానా మోసం..