BJP vs BRS : కవిత ఈడీ నోటీసుల కామెంట్స్ పై బండి సంజయ్ కౌంటర్

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో క‌విత‌కు ఈడీ నోటీసులు అందాయి. రేపు విచార‌ణ‌కు రావాల‌ని ఆమెకు ఈడీ అధికారులు నోటీసులు

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 10:04 PM IST

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో క‌విత‌కు ఈడీ నోటీసులు అందాయి. రేపు విచార‌ణ‌కు రావాల‌ని ఆమెకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.. అయితే నోటీసుల‌పై క‌విత స్పందించారు. అవి ఈడీ నోటీసులు కాదు మోడీ నోటీసులు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. క‌విత వ్యాఖ్య‌ల‌కు బీజేపీ మాజీ చీఫ్ బండి సంజ‌య్ కౌంట‌ర్ ఇచ్చారు. కవితకు ఇచ్చిన‌ ఈడీ నోటీసులకు బీజేపీకి ఏం సంబంధం? అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. తప్పు చేశారని ఆధారాలుంటే విచారించే అధికారం ఈడీకి ఉంద‌ని బండి సంజ‌య్ తెలిపారు. మోడీ ఛరిష్మా ముందు కేసీఆర్ దిగదుడుపేన‌ని.. కేసీఆర్ మోహం చూసి ఓట్లేసే రోజులు పోయాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేన‌ని.. డిపాజిట్లు రాని కాంగ్రెస్  గ్రాఫ్ ను పెంచేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని బండి సంజ‌య్ ఆరోపించారు.