నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వాహనంపై దాడి జరిగింది. ఈ దాడి టీఆర్ ఎస్ కార్యకర్తలు చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. నందిపేట్ మండలం నూత్‌పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన వెళ్తుండగా ఆర్మూర్ మండలం ఇస్సపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో అర్వింద్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. బీజేపీ, టీఆర్ఎస్ ఇరువర్గాల ఘర్షణతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.
నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్తున్న పార్లమెంట్ సభ్యులు Arvind Dharmapuri పాటు బిజెపి నాయకులపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి అంజయ్ తెలిపారు. ఎంపీ అర్వింద్ కు ఫోన్ ద్వారా దాడికి సంబంధించి వివరాలను బండి సంజయ్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలను గుప్పిట్లో పెట్టుకుని కేసీఆర్ క్రూరంగా, రజాకార్ లాగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలపై టీఆర్ఎస్ దాడులకు ప్రోత్సహించడం సిగ్గుచేటు అని, దాడుల వెనుక సీఎం కేసీఆర్ కుట్ర ఉందనీ బండి అన్నారు. బెదిరింపులు, దాడులకు బిజెపి కార్యకర్తలు వెరవరని, నియంతృత్వ, అవినీతి టీఆర్ఎస్ సర్కారుపై బిజెపి పోరాటం ఆగదని బండి సంజయ్ హెచ్చరించారు.
అన్ని ప్రభుత్వ శాఖలను గుప్పిట్లో పెట్టుకుని కేసీఆర్ క్రూరంగా, రజాకార్ లాగా వ్యవహరిస్తున్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలపై టీఆర్ఎస్ దాడులకు ప్రోత్సహించడం సిగ్గుచేటు. దాడుల వెనుక సీఎం కేసీఆర్ కుట్ర ఉంది. బెదిరింపులు, దాడులకు @BJP4Telangana కార్యకర్తలు భయపడరు. pic.twitter.com/guTc5EKNoZ
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 25, 2022