Bandi Sanjay: కేసీఆర్ కు బండి సంజయ్ ఆఫర్ అండ్ హెచ్చరిక

బడ్జెట్ సందర్బంగా బీజేపీ పై కేసీఆర్ చేసిన విమర్శలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

  • Written By:
  • Updated On - February 1, 2022 / 09:59 PM IST

బడ్జెట్ సందర్బంగా బీజేపీ పై కేసీఆర్ చేసిన విమర్శలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

బడ్జెట్ పై పిచ్చిపట్టి వాగుతున్న సీఎం ఇంత నీచపు బతుకు ఎందుకు బతుకున్నడో అర్ధం కావడం లేదని, కేసీఆర్ వాడిన భాషని చూసి తెలంగాణ ప్రజలు థూ అంటున్నారని సంజయ్ తెలిపారు. కేసీఆర్ లాంటి మెంటల్ గాళ్ల కోసమే ప్రత్యేకంగా ఈ బడ్జెట్ లో మెంటల్ ఆసుపత్రుల ఏర్పాటు కోసం నిధులు కేటాయించినట్లుందని బండి తెలిపారు.

రాజ్యాంగాన్ని తిరగరాయాలని కేసీఆర్ మాటలని చూస్తే ఆయన అక్కసు బయటపడిందని బండి విమర్శించారు. ఇన్ని రోజులుగా కేసీఆర్ తన కడుపులో దాచుకున్న దారుణం ఈరోజు బయట పెట్టుకున్నాడని, కేసీఆర్ అంబేద్కర్ ని అవమానపరిచారని బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వ్యాఖ్యలపై చర్చ జరగాల్సిందేనని, కేసీఆర్ అనే మూర్ఖుడు దేశాన్ని ఏ విధంగా విచ్చిన్నం చేయాలని చూస్తున్నడో కుట్ర అర్ధం అవుతోందని బండి తెలిపారు. కొడుకును సీఎం చేయడానికే కేసీఆర్ జాతీయ రాజకీయాల గూర్చి మాట్లాడుతున్నాడని బండి తెలిపారు. దేశంలోనే పెద్ద అవినీతి పరుడు కేసీఆర్ అని, ఆయన జైలుకు పోవడం ఖాయమని బండి మరోసారి స్పష్టం చేశారు.

కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తుందంటున్న కేసీఆర్ కి తాను మోదీ అపాయింట్మెంట్ ఇప్పిస్తానని, దమ్ముంటే వెళ్లి మోదీతో మాట్లాడాలని బండి సవాలు విసిరారు. సీఎం ఇకనైనా తన భాష మార్చుకోవాలని సంజయ్ హెచ్చరించారు.