Diwali 2023: బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాలిస్తే కేసులు

దీపావళి పండుగ విషాదంగా మారకూడదనే కారణంగా అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. ఇతరులకు ఆటంకం కలిగించే విధంగా టపాసులు కల్చరాదని నగర పోలీసు అధికారులు స్పష్టం చేశారు. రేపు ఆదివారం దీపావళి సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో

Diwali 2023: దీపావళి పండుగ విషాదంగా మారకూడదనే కారణంగా అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. ఇతరులకు ఆటంకం కలిగించే విధంగా
టపాసులు కల్చరాదని నగర పోలీసు అధికారులు స్పష్టం చేశారు. రేపు ఆదివారం దీపావళి సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం , పటాకులు కాల్చడంపై హైదరాబాద్ పోలీసులు నిషేధం విధించారు .

దీపావళి పండుగ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా పేల్చడం, పటాకులు పేల్చడం పూర్తిగా నిషేధమని సిటీ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య పేర్కొన్నారు. ధ్వనిని విడుదల చేసే పటాకులను పేల్చడంపై పూర్తి నిషేధం విధిస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు. అధిక ధ్వనిని విడుదల చేసే టపాసులపై ఆమె ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నియమాలు మరియు నిబంధనలను ఉల్లంఘించిన వారు, హైదరాబాద్ సిటీ పోలీసు చట్టం, 1348 ప్రకారం ప్రాసిక్యూషన్‌కు బాధ్యత వహిస్తారని ఆయన చెప్పారు. ఈ ఆదేశాలు నవంబర్ 12 ఉదయం 6 నుండి నవంబర్ 15 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయి.

Also Read: లోకేష్ తనకు తమ్ముడులాంటి వాడు – కేటీఆర్