Nude Photoshoot: పవిత్ర ప్రదేశంలో ఓ జంట నగ్న ఫోటోషూట్, శిక్ష విధించిన ఆ దేశ ప్రభుత్వం.!!

పవిత్రమైన ప్రదేశాల్లో వెకిలి వేషాలు వేసిన ఓ రష్యన్ జంటపై ఇండోనేషియా ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

  • Written By:
  • Publish Date - May 8, 2022 / 06:45 PM IST

పవిత్రమైన ప్రదేశాల్లో వెకిలి వేషాలు వేసిన ఓ రష్యన్ జంటపై ఇండోనేషియా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. స్థానిక బాలి పర్యాటక స్థలంలోని ఓ పవిత్రమైన చెట్టు ఎదుట నగ్నంగా ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగడమే కాదు, వాటిని ఇన్ స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశారు. దీంతో అక్కడి ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. ఆ రష్యన్ జంటను 6నెలల పాటు తమ దేశంలో అడుగుపెట్టకుండా కఠిన నిర్ణయం తీసుకుంది.

వివరాల్లోకి వెళితే సుమారు ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న మర్రిచెట్టును స్థానిక బాలీ హిందూ ప్రజలు పవిత్రంగా భావిస్తున్నారు. అంతే కాదు ఈ వృక్షం ఉన్న ప్రదేశంలో బాబకన్‌ దేవాలయం కూడా ఉంది. అలాంటి పవిత్రమైన చెట్టు దగ్గర ఓ విదేశీ జంట అయిన రష్యా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అలినా ఫజ్లీవా, ఆమె భర్త ఆండ్రే వెకిలి పనులకు పాల్పడ్డారు. స్థానికులు ఎవరూ లేని సమయంలో ఆ చెట్టు ఎదురుగా నిలబడి నగ్నంగా ఫోట్‌ షూట్‌ చేశారు. బాబకన్‌ గుడిలోని ఆ మర్రిచెట్టు దగ్గర న్యూడ్‌ ఫోటోషూట్‌ చేసిన ఆ జంట వాటిని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది.

అయితే అలినా ఫజ్లీవా ఇన్‌స్టాగ్రామ్‌ లో ఓ ఫేమస్ మోడల్‌ గా పేరుంది. అయితే బాలిలోని బాబకన్‌ గుడి చెట్టు ఎదుట నగ్నంగా ఫోటోలు ఇచ్చిన రష్యన్ జంటకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కాసేపట్లోనే, స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. దీంతో రష్యా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అలినా ఫజ్లీవాను, ఆమె భర్తను బాలి నుంచి వెంటనే విడిచి వెళ్లిపోయారు. దీంతో స్థానిక ఇండోనేషియా ప్రభుత్వం కూడా ఇక ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. రష్యన్ జంటకు శిక్షగా ఆరు నెలలపాటు ఇండోనేషియాలో అడుగుపెట్టనివ్వకుండా ఆదేశాలు జారీ చేసింది. రష్యాకు తిరిగి వెళ్లిన ఆ జంట.. క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను పోస్ట్‌ చేయడం కొసమెరుపు.