Balayya fan: అర్జంటీనా స్టార్ గోల్ కీపర్ మార్టినెజ్ ను కలిసిన బాలయ్య అభిమాని!

మార్టినెజ్ భారత పర్యటన గురించి తెలుసుకున్న ఎస్.ఎన్. కార్తికేయ పాడి కోల్ కతా వెళ్ళి మార్టినెజ్ ను కలిశాడు.

  • Written By:
  • Publish Date - July 11, 2023 / 04:48 PM IST

చిన్నప్పటి నుండి నందమూరి బాలకృష్ణ వీరాభిమాని అయిన కార్తికేయ పాడి ప్రస్తుతం డాక్టర్ బి. వి. రాజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నర్సాపూర్ క్యాంపస్)లో బి.టెక్. మొదటి సంవత్సరం కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. స్వతహాగా ఫుట్ బాల్ ప్లేయర్ అయిన కార్తికేయ రాయల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ (లండన్)లో ఓకల్ వెస్ట్రన్, పియానో 5వ గ్రేడ్ ఉత్తీర్ణత కూడా సాధించాడు. నందమూరి బాలకృష్ణ వందవ చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’లో కార్తికేయకు నటించే అవకాశం వచ్చినా… ఎగ్జామ్స్ కారణంగా ఆ అవకాశాన్ని వినియోగించుకోలేక పోయాడు. అయితే… స్కూల్, కాలేజీలో ఫుట్ బాల్ క్రీడాకారుడైన కార్తికేయ ఇటీవల తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. తన అభిమాన ఫుట్ బాల్ ప్లేయర్ ఎమిలియానో మార్టినెజ్ ను కోల్ కతా వెళ్ళి కార్తికేయ కలిశాడు.

1986 డిగో మారడోనా సారధ్యంలో అర్జంటీనా ప్రపంచకప్ గెలిచిన తర్వాత చాలా సంవత్సరాలకు 2022లో కతార్ లో జరిగిన ప్రపంచ కప్ విజేతగా అర్జంటీనా తిరిగి తన విజయ పతాకాన్ని రెపరెపలాడించింది. ఈ ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం వెనుక గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ పాత్ర కీలకమైంది. ఫిఫా 2022 ఫైనల్ చేరుకున్న అర్జంటీనా, ఫ్రాన్స్ తో జరిగిన మ్యాచ్ 3-3 తో సమం కావడంతో, విజేతను నిశ్చయించడానికి జరిగిన పెనాల్టీ ఘూటౌట్ లో అనూహ్యంగా ఫ్రాన్స్ పెనాల్టీ కిక్ ను అర్జంటీనా గోల్ కీపర్ మార్టినెజ్ నిలువరించడంతో అర్జంటీనా 4-2తో విజేతగా నిలచింది. ఈ విజయంలో కీలక పాత్రధారి అయిన గోల్ కీపర్ మార్టినెజ్, 2021 కోపా కప్ సెమి ఫైనల్ లో కూడా మూడు పెనాల్టీలు నిలువరించాడు. అలా అర్జంటీనా జట్టు ఫైనల్ చేరడంతో పాటు ఆ సంవత్సరం విజేతగా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు.

ఫిఫా 2022 కతార్ ప్రపంచకప్ తర్వాత మార్టినెజ్ విపరీతమైన క్రేజ్, అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన జూలై నెలలో 4, 5 తేదీలలో భారత్ ను సందర్శించాడు. కోల్ కతా లోని మోహన్ బగాన్ క్లబ్ లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. మార్టినెజ్ భారత పర్యటన గురించి తెలుసుకున్న ఎస్.ఎన్. కార్తికేయ పాడి కోల్ కతా వెళ్ళి మార్టినెజ్ ను కలిశాడు. ఆయనను కలవడంతో పాటు 2022 ప్రపంచకప్ రిప్లికా తో ఫోటో దిగాడు. అలానే మార్టినెజ్ ను ఆయన విడిదిలో ప్రత్యేకంగా కలిసి, అర్జంటీనా జెర్సీపై ఆటోగ్రాఫ్ ను తీసుకున్నారు. అంతగా ప్రచారం లేని ఈ పర్యటన గురించి సోషల్ మీడియా ద్వారానే కార్తికేయ తెలుసుకుని, హుటాహుటిన కోల్ కతా చేరి మార్టినెజ్ కు కలిసి రావడం విశేషం. ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు, బాలకృష్ణకు గాత్ర దానం చేయాలన్నది తన కోరిక అని కార్తికేయ పాడి చెబుతున్నాడు. విశేషం ఏమంటే… కార్తికేయ తమ్ముడు శ్రీకృష్ణ దేవరాయ సైతం బాలయ్య బాబుకు వీరాభిమానే! ఈ ఇద్దరు అన్నదమ్ములంటే బాలకృష్ణకూ ప్రత్యేకమైన అభిమానం!!

Also Read: TSRTC: ప్రతి పౌర్ణమికి తమిళనాడు అరుణాచల గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సులు