Site icon HashtagU Telugu

Hyderabad : బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్ పేరు మార్చిన తెలంగాణ ప్ర‌భుత్వం

Telangana

Telangana

హైదరాబాద్‌లోని బాలానగర్ ఫ్లైఓవర్ ఇక నుంచి ‘డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్’గా పిలవబడుతుందని తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్రీడమ్ ఫైట‌ర్‌గా, భారత ఉప ప్రధానిగా, సామాజిక న్యాయం కోసం ప్రచారకర్తగా, పేదల రక్షకుడిగా, అసాధారణ పార్లమెంటేరియన్‌గా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆదర్శప్రాయమైన సేవలందించారని MAUD విభాగం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మాజీ ఉపప్రధానికి గౌరవప్రదంగా గుర్తిస్తూ, జులై 6, 2023న ఆయన వర్ధంతి సందర్భంగా బాలానగర్ ఫ్లైఓవర్‌కు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్ అని పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌ను కోరారు.