Site icon HashtagU Telugu

Balakrishna: ప్రపంచవ్యాప్తంగా ‘అన్న’ క్యాంటీన్లు!

Anna Canteen

Anna Canteen

రాజ‌కీయ దురుద్దేశంతోనే “అన్న క్యాంటీన్ల‌”ను వైసీపీ స‌ర్కారు ర‌ద్దు చేసిందని టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ఆరోపించారు. తెలుగు ప్ర‌జ‌ల స‌హకారంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు మళ్లీ ఏర్పాట‌వుతాయ‌ని ప్ర‌క‌టించారు. గుంటూరులోని జేకేసీ రోడ్డులో టీడీపీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా బాలయ్య మాట్లాడారు. పేద‌వాడి ఆక‌లి తీర్చాల‌న్న ఎన్టీఆర్ ఆశ‌య సాధనలో భాగంగానే అన్న క్యాంటీన్ల‌ను గత టీడీపీ హయాంలో ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు తాము అధికారంలో లేకున్నా జన సంక్షేమ లక్ష్యంతో ఈ క్యాంటీన్ ను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వ అరాచకం అంతమయ్యే సమయం దగ్గరలోనే ఉందని బాలయ్య వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ని గెలిపించి మళ్లీ సంక్షేమ పాలనను తెచ్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.