ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తాజాగా టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల సీఎం జగన్‌తో సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో భాగంగా ఏపీలో సినిమా టికెట్ల రేట్లు, సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యల పై జరిపిన చర్చలపై జగన్ మోహన్ రెడ్డి సాగుకూలంగా స్పందించారని, త్వరలోనే శుభవార్త వింటారని మీడియా సాక్షిగా సినీ ప్రముఖులు చెప్పారు.
అయితే సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కారం కోసం జగన్‌తో భేటీకి రావాలని బాలకృష్ణను ఆహ్వానించగా, ఆరు నూరైనా ముఖ్యమంత్రి జగన్‌ను కలిసే ప్రసక్తే చేదని చెప్పారట. ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గించినా, అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను సాధించి బ్లాక్ బస్టర్ అయ్యిందని బాలకృష్ణ అన్నారు. ఇక తాను రెమ్యునరేషన్ పెంచబోనని, దీంతో టికెట్ల రేట్లు పెంచినా, తగ్గించినా, తనకు ఎలాంటి సమస్యలేదని బాలకృష్ణ అన్నారు. దీంతో బాలయ్య చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.