Site icon HashtagU Telugu

Sisodia : సిసోడియాకు బెయిల్‌..నిజం గెలిచింది: మంత్రి అతిషి

Bail for Sisodia...Truth has won: Minister Atishi

Bail for Sisodia...Truth has won: Minister Atishi

Sisodia: ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత మనీశ్ సిసోడియాకు భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే. మద్యం కుంభకోణం కేసు(Liquor scam case)లో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 17 నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు రాబోతుండటంతో ఆప్‌ నేతలు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సిసోడియాకు బెయిల్‌ రావడంపై ఢిల్లీ మంత్రి అతిషీ(Minister Atishi) సంతోషం వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

“నిజం గెలిచింది..” అంటూ తీవ్ర భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ’17 నెలల పాటు జైలులో ఉన్న మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ లభించింది. ఈ రోజు నిజం గెలిచింది. ఇది ఢిల్లీ ప్రజల విజయం. విద్యార్థుల విజయం. సిసోడియా ఢిల్లీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించడం కొందరికి నచ్చలేదు. అందుకే తప్పుడు కేసులో ఇరికించి జైలుపాలు చేశారు. ఇప్పుడు న్యాయమే గెలిచింది’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఇదే కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా ఇతర నేతలకు కూడా న్యాయం జరుగుతుందని అతిషీ ఆశాభావం వ్యక్తం చేశారు. వారు కూడా త్వరలోనే బయటకు వస్తారని ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

మద్యం కుంభకోణం కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సిసోడియాను అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తీహార్‌ జైల్లోనే ఉంటున్నారు. బెయిల్‌ కోసం తీవ్రంగా పోరాటం చేశారు. ఈ క్రమంలో సుప్రీం తీర్పుతో 17 నెలలుగా జైలు జీవితాన్ని గడుపుతున్న సిసోడియాకు భారీ ఊరట లభించినట్లైంది. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై ఆమ్‌ ఆద్మీ పార్టీ సంతోషం వ్యక్తం చేసింది. చివరికి సత్యమే గెలిచింది అంటూ ఆప్‌ నేతలు సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నారు.

Read Also: Murari Movie Re Release : ‘మురారి’ ప్రదర్శిస్తున్న థియేటర్ లోనే పెళ్లి చేసుకున్న జంట