Site icon HashtagU Telugu

TRS : టీఆర్ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన బ‌డంగ్‌పేట మేయ‌ర్‌

Congress

Congress

బడంగ్‌పేట కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్‌రెడ్డి, రాళ్లగూడ శ్రీనివాసరెడ్డి, మరికొందరు కార్పొరేటర్లు ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. త్వరలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా మేయర్, కార్పొరేటర్ల చేరికను కాంగ్రెస్ గోప్యంగా ఉంచిన విషయం తెలిసిందే.అయితే శనివారం రాత్రి విషయం బయటకు వచ్చింది. దీంతో మేయర్ పారిజాత నర్సింహారెడ్డితోపాటు ఇద్దరు కార్పొరేటర్లను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.

Exit mobile version