Site icon HashtagU Telugu

The Kashmir Files: అక్కడ హిట్.. ఇక్కడ ఫట్!

The Kashmir

The Kashmir

‘ది కాశ్మీర్ ఫైల్స్’ దేశవ్యాప్తంగా మార్మోగిన పేరు. ఈ సినిమా ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. పెద్ద పెద్ద సినిమాలను సైతం వెనక్కి నెట్టి ట్రెండింగ్ లో నిలిచింది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. హిందీలో మాత్రమే విడుదలైనప్పటికీ.. ఈ చిత్రం దక్షిణాదిలో కూడా ఓకే అనిపించుకుంది. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. అయితే ఓటీటీలోనూ మంచి పేరొస్తుందని భావించారు.

ఎట్టకేలకు ఈ సినిమా జీ5  లో వచ్చింది. ఆశ్చర్యకరంగా మెజారిటీ ప్రేక్షకులు 20 నిమిషాలు చూసిన తర్వాత సినిమాను అవైడ్ చేశారని నివేదికలు చెబుతున్నాయి. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కొంత సమయం పడుతుందనేది నిజం. ఇందులో ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. కానీ డాక్యుమెంటరీ మోడ్‌లో నడుస్తుంది. ఈ చిత్రానికి కావాల్సిన అటెన్షన్‌ కేవలం థియేటర్లలోనే ఉంటుంది. కానీ పర్సనల్ స్క్రీన్‌లపై అంతగా ఎఫెక్ట్ ఉండదు. అందుకే సినిమా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. వాస్తవానికి జీ5 వైపు నుండి ప్రచారం లేకపోవడం కూడా కారణమని తెలుస్తోంది. ప్రస్తుతానికి, థియేటర్లలో పెద్ద హిట్ అయిన ఈ చిత్రం ఓటిటిలో ఫ్లాప్ అని తెలిసిపోయింది.

Exit mobile version