Site icon HashtagU Telugu

Electricity: ప్రజలకు బ్యాడ్‌న్యూస్.. విద్యుత్ సబ్సిడీ ఎత్తేసిన సర్కార్

Whatsapp Image 2023 04 14 At 20.34.51

Whatsapp Image 2023 04 14 At 20.34.51

Electricity: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఆప్ ప్రభుత్వం మధ్య ఎప్పుడు ఏదోక ఇష్యూలో వార్ నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా వీకే సక్సేనా ఉన్నారు. ఆయనకు, ప్రభుత్వంకు మధ్య ప్రత్యక్ష పోరు నడుస్తోంది. కొంచెం కూడా అసలు పొసగడం లేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఆయన తప్పుబడుతున్నారు. దీంతో ఆప్ ప్రభుత్వం కూడా ఆయనపై విమర్శలు చేస్తోంది. దీంతో ఇప్పటినుంచో ఈ వార్ అలాగే కొనసాగుతూ వస్తోంది.

ఈ క్రమంలో తాజాగా మరోసారి ఆప్ సర్కార్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య మరో వివాదం చెలరేగింది. విద్యుత్ సబ్సిడీ విషయంలో వీకే సక్సేనా, ఢిల్లీ ప్రభుత్వం మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంటుంది. విద్యుత్ సబ్సిడీకి సంబంధించిన దస్త్రాలపై వీకే సక్సేనా సంతకం పెట్టలేదని, అందుకే కరెంట్ సబ్సిడీని నిలిపివేస్తున్నట్లు ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం మండిపడుతుంది.

కరెంట్ సబ్సిడీ వల్ల 46 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. ఈ పథకాన్ని కొనసాగించేందుకు అవసరమైన ఫైల్‌పై లెఫ్టినెంట్ గవర్నర్ సంతకం చేయలేదు. అందుకే ఈ పథకాన్ని నిలిపివేస్తున్నామని, సోమవారం నుంచి సబ్సిడీ లేకుండా కరెంట్ బిల్లులు లెక్కిస్తామని తెలిపారు. ఈ పథకాన్ని కొనసాగించేందుకు ఇటీవల బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించారు. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలపకపోవడం వల్ల ఆగిపోయింది. దీనిపై స్పందించిన లెప్టినెంట్ గవర్నర్ ఆఫీస్.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, అనవసర రాజకీయాలు చేయవద్దని తెలిపారు.

ఏప్రిల్ 15తో గడువు ముగుస్తున్నప్పుడు పథకం కొనసాగింపుపై ఇప్పటివరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని గవర్నర్ కార్యాలయం ప్రశ్నించింది. నాలుగు రోజుల ముందు మాత్రమే తనకు దస్త్రాన్ని పంపడం వెనుక మతలబు ఏంటని ప్రవ్నించారు. రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. తనదే తప్పు అని చిత్రీకరించడం సరికాదని సీరియస్ అయ్యారు.