Baby Elephant Video: పిల్ల ఏనుగు చిలిపి చేష్టలు, జూ కీపర్ తో సరదా పోరాటం, వైరల్ అవుతున్న వీడియో…!

మూగజీవాలతో స్నేహం చేస్తే అవి ఎంతో విశ్వాసంగా ఉంటాయి.

Published By: HashtagU Telugu Desk
Elephant

Elephant

మూగజీవాలతో స్నేహం చేస్తే అవి ఎంతో విశ్వాసంగా ఉంటాయి. అంతేకాదు అవి మనతో ఎంతో సరదాగా ఆడుకుంటాయి. తమ ప్రేమను పంచుకుంటాయి. వాటిని ప్రేమగా చూసుకుంటే చాలు పిల్లల లాగే ఒదిగిపోతాయి. తాజాగా ఐఎఫ్ఎస్ అధికారి డాక్ట‌ర్ సామ్రాట్ గౌడ షేర్ చేసిన ఓ ఏనుగు పిల్ల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఓ ఏనుగు పిల్లను చూసుకునే కీపర్ సరదాగా కాసేపు ఓ మ్యాట్రెస్ తెచ్చుకొని పడుకున్నాడు. అది చూసిన పిల్ల ఏనుగు తన తల్లితో ఆహారం తింటున్న విషయం సైతం పక్కన పెట్టేసి, అడ్డుగా ఉన్న ఫెన్సింగ్‌ దాటి తన సంరక్షకుడితో దెబ్బలాటకు దిగింది. ఆ పరుపుపై తానే పడుకుంటాను అని మారాం చేసింది. అతడిని వెళ్లగొట్టి పడుకుంది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. చివరికి ఇద్దరు కలసి బెడ్‌ మీద పడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో భారతీయ అటవీ అధికారి డాక్టర్ సామ్రాట్ గౌడ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోకు Hey! That’s my bed..get up.. అనే ట్యాగ్ ఉంచారు.

https://twitter.com/IfsSamrat/status/1523901040919154688

  Last Updated: 18 May 2022, 10:26 AM IST