Site icon HashtagU Telugu

Eternal Baby Smile: ఈ పాప చిరునవ్వు శాశ్వతం.. ఎందుకంటే..?

Baby Smile

Baby Smile

ఈ పాపను చూసి.. చక్కటి చిరునవ్వులు చిందిస్తోందే అని అనుకుంటున్నారా!! అది.. ఆ పాప చిరునవ్వు కాదు, ముఖ కవళిక!! ఔను.. పుట్టుకతోనే ఈ చిన్నారికి “పర్మినెంట్ స్మైల్” రుగ్మత తలెత్తింది. తల్లి కడుపులో పిండ దశలో ఉండగా నోటి దిగువ భాగం నిర్మాణంలో జరిగిన లోపాల వల్ల .. నిత్యం నవ్వుతున్నట్లు గా కనిపించే పరిస్థితి ఏర్పడింది.

ఈ పాప పేరు ఐలా సమ్మర్ ముచ ( Ayla Summer Mucha). ఆస్ట్రేలియా కు చెందిన క్రిస్టినా వేర్చేర్ (21), బ్లేయిజ్ ముచ (20) దంపతులకు 2021 డిసెంబరు లో జన్మించింది.పుట్టుక తోనే పాపలో బై లేటరల్ మైక్రో స్టోమియా (bilateral microstomia) అనే నోటి సమస్యను వైద్యులు గుర్తించారు. దీనివల్లే చిన్నారిలో పర్మినెంట్ స్మైల్ రుగ్మత వచ్చింది.

పాప ఫోటోను తల్లిదండ్రులు ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ లో షేర్ చేయగా లైక్స్, వ్యూస్ వెల్లువెత్తాయి. దీంతో చిన్నారి ఐలా సోషల్ స్టార్ గా మారిపోయింది. పాపకు ఒక ప్రత్యేక సర్జరీ చేయించి.. ఈ సమస్య లేకుండా చేసే ప్రయత్నాల్లో తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. కాగా, ఇప్పటివరకు ప్రపంచంలో14 మందిలోనే ఈ సమస్యను గుర్తించడం గమనార్హం.