Site icon HashtagU Telugu

Baby 4 Hands 4 Legs : 4 చేతులు, 4 కాళ్లతో శిశువు.. పుట్టిన 20 నిమిషాలకే..

Baby 4 Hands 4 Legs

Baby 4 Hands 4 Legs

Baby 4 Hands 4 Legs : 4 చేతులు, 4 కాళ్లతో శిశువు జన్మించింది..   

పుట్టిన 20 నిమిషాలలోనే తుది శ్వాస విడిచింది..  

బీహార్‌లోని సరన్ జిల్లా ఛాప్రాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఛాప్రాలోని శ్యామ్‌చక్‌లో ఉన్న సంజీవని నర్సింగ్ హోమ్‌లో ప్రియా దేవి అనే మహిళ 4 చేతులు, 4 కాళ్లతో(Baby 4 Hands 4 Legs) ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ పసికందు  తల ఆకారం కూడా అసాధారణంగా ఉంది. దీంతో ఆ పసికందును చూసేందుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. కొంతమంది ఇది దైవిక అవతారమని చెప్పగా.. ఇంకొంతమంది జీవ సంబంధమైన క్రమరాహిత్యం వల్ల శిశువు ఇలా పుట్టిందన్నారు. దురదృష్టవశాత్తు ఈ శిశువు జన్మించిన కొద్దిసేపటికే చనిపోయింది.

Also read : Twins Surgery: మెదళ్లు, తల అతుక్కుని జన్మించిన కవలలు.. ఆపరేషన్‌తో డాక్టర్లు కొత్త చరిత్ర!

ఈ శిశువుకు రెండు వెన్నుపాములతో పాటు ఒకే తల, నాలుగు చెవులు, నాలుగు కాళ్లు, నాలుగు చేతులు, రెండు గుండెలు ఉన్నాయని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ వెల్లడించారు.  గర్భాశయంలోని ఒకే అండంలో రెండు పిండాలు అభివృద్ధి చెంది.. కవలల విభజన అసంపూర్తిగా జరిగితే ఇలాంటి  ప్రత్యేక లక్షణాలతో పిల్లలు పుడతారని వివరించారు.

అవిభక్త కవలలు ఎలా పుడతారంటే?

మోనోజైగోట్‌ ట్విన్స్‌ అవిభక్త కవలలుగా పుట్టే అవకాశం ఉంటుంది. ఫలదీకరణం చెందిన తర్వాత 12 రోజులకు వేర్వేరు శరీరాలు ఏర్పడటంలో వైఫల్యం చెందితే ఇలా జరుగుతుంది. ప్రసవం అనంతరం కొన్ని రోజులు లేదా సంవత్సరాలకు.. అవిభక్త కవలలుగా పుట్టిన వారిని వేరు చేసే శస్త్ర చికిత్సలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అయితే అలా చేయడానికి ఇద్దరు కవలల గుండె, మెదడు, కాలేయం, ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన అవయవాలు వేర్వేరుగా ఏర్పడి ఉండాలి. కొన్ని సంక్లిష్టమైన కేసుల్లో మాత్రమే శస్త్రచికిత్స చేయడం మంచిది కాదని వైద్యులు చెబుతుంటారు. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వీణ-వాణి ఇలా జన్మించిన అవిభక్త కవలలే.