ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఈ నెల 12 న చంద్రబాబు 4 వ సారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమరావతి లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబదించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే తరుణంలో బాబు మంత్రివర్గంలో ఎవరెవరికి ఛాన్స్ దొరుకుతుందో అని అంత ఆసక్తి కనపరుస్తున్నారు. ఎందుకంటే ఈసారి గెలిచినా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అలాగే సీనియర్ నేతలు ఓ పక్క , మిత్రపక్షం జనసేన, బిజెపి మరోపక్క ఉన్నారు. ఈరోజు సీఎం గా చంద్రబాబు బాధ్యతలు తీసుకోవడానికి ప్రధాన కారణం జనసేన, బిజెపి పార్టీలే. అందుకే వారికీ కూడా మంత్రి వర్గంలో ఛాన్స్ ఇస్తారని అంత మాట్లాడుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం పలువురి పేర్లు సోషల్ మీడియా వైరల్ గా మారాయి. రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో జనసేనకు 6 మంత్రి పదవులు దక్కవచ్చని అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ CM పదవి వరించవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జనసేనానితోపాటు మరో ఐదుగురికి మంత్రి పదవులు దక్కవచ్చని సమాచారం. మంత్రి పదవుల రేసులో నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేశ్, బుద్ధ ప్రసాద్, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నట్లు సమాచారం. ఇటు టీడీపీ నుండి అచ్చెన్నాయుడు, కూన రవి, కోండ్రు మురళి, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాస్, అయ్యన్న, పల్లా శ్రీనివాస్, యనమల, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పితాని, RRR, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల, సోమిరెడ్డి, ఆనం, పరిటాల సునీత, అఖిలప్రియ, గౌరు చరిత సహా పలువురు రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరికీ పదవులు దక్కుతాయో చూడాలి. ఈరోజు టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు, జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేరడంపై బీజేపీ ప్రతిపాదనలు, రాష్ట్ర మంత్రివర్గ కూర్పు, తదితర అంశాలపై చర్చించనున్నారు.
Read Also : BJP : తెలంగాణ బీజేపీ ఎంపీలు ఢిల్లీకి పయనం