బల్గేరియాకు చెందిన బాబా వాంగా గురించి మనందరికీ తెలిసిందే. ఈమె భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి ముందుగానే చెప్పి చాలాబాగా ఫేమస్ అయ్యింది. అంతేకాకుండా ఆమె చెప్పిన అంశాలు నిజం అవడంతో ఆమెకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. అయితే చిన్నప్పుడే కంటి చూపును కోల్పోయిన ఈమెకు ఆ దేవుడు భవిష్యత్తును చూసే దివ్య శక్తిని ఇచ్చారు అని విశ్వసిస్తూ ఉంటారు. కాగా బాబా వాంగా ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకునే పరిణామాల్ని ముందునే అంచనా వేసి చెప్పారు.. అలా చెప్పిన వాటిలో చాలా వరకు నిజాలు అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకునే కీలక పరిణామాలతో పాటుగా భారతదేశానికి సంబంధించిన ఒక కీలక అంశాన్ని కూడా ఆమె తెలిపింది.
కాగా బాబా వాంగా తెలిపిన కీలక అంశం భరత్ ప్రజలను కలవరానికి గురి చేస్తోంది. బాబా వాంగా 2022 సంవత్సరంకు సంబంధించి రెండు విషయాలను చెప్పగా రెండు కూడా నిజమయ్యాయి. అందులో మొదటిది ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పగా అది నిజమైంది. ఇక రెండవది అనేక నగరాల్లో కరువు, నీటి సంక్షోభం. ఈ అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియా తూర్పు తీరంలో కుండపోత వర్షాలు కురిశాయి. దీనివల్ల అక్కడ తీవ్ర వరదలు సంభవించాయి. అలా ఆమె చెప్పిన విధంగా రెండు అంశాలు కూడా జరిగాయి. అలాగే భారతదేశం గురించి బాబా ప్రస్తావించారు.
ఈ సంవత్సరం ప్రపంచంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని,దీని కారణంగా మిడతల వ్యాప్తి పెరుగి పచ్చదనం, ఆహారం కోసం మిడతల దండు భారతదేశం పై దాడి చేస్తాయని,ఇది పంటలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది అని బాబా వాంగా తెలిపింది. దేశంలో కరువుకు కారణం అవుతుంది. మరి బాబా వాంగా చెప్పిన ఈ విషయాలు నిజం అవడంతో భారత్ ప్రజలను ఈ అంశం కలవరపెడుతోంది. ఒకవేళ బాబా వాంగా చెప్పిన విధంగా జరిగితే భారత్ ప్రజల పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది.