Baal Aadhaar: అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్.. ప్రాసెస్ ను తెలుసుకోండిలా?

భారత్ లో ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు అన్నది

  • Written By:
  • Publish Date - October 15, 2022 / 06:25 PM IST

భారత్ లో ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరిగా ఉండాల్సిందే. అంతేకాకుండా భారత దేశంలో ఆధార్ కార్డు లేనిది ఏ పని కూడా జరగదు. కాలక్రమేనా ఈ ఆధార్ కార్డు గుర్తింపు కార్డుగా కూడా మారిపోయింది. అయితే ఆధార్ కార్డు చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. మరి అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకు కూడా ఆధార్ కార్డు ఉంటుందా అంటే ఉంటుంది అంటున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ కార్డు అవసరం.

ఎందుకంటే పాఠశాల అడ్మిషన్ ప్రక్రియ సమయంలో ఆధార్ నెంబర్ ను తప్పకుండా అడుగుతున్నారు. అయితే ఒకవేళ ఇప్పటికీ మీ పిల్లలకు ఆధార్ కార్డు తీసుకోకపోతే వెంటనే ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి. నవజాత శిశువులు అలాగే ఐదేళ్ల లోపు పిల్లలు ఎవరైనా ఆధార్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది లేకపోతే ఎన్ని రకాలు ఇబ్బందులు ఎదురవుతాయో మనందరికీ తెలిసిందే. కాబట్టి నవజాత శిశువులకు కూడా ఆధార్ తప్పనిసరి. కాగా దేశవ్యాప్తంగా కొన్ని ఆసుపత్రులలో అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ కార్డు ను తయారు చేసే ఒక ప్రక్రియను కల్పిస్తున్నాయి.

అయితే పిల్లల ఆధార్ కార్డు కోసం కావాల్సిన సర్టిఫికెట్ల విషయానికి వస్తే.. పిల్లల బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రులలో ఒకరి గుర్తింపు కార్డు, కానీ ఇక్కడ ఎటువంటి ఫింగర్ ప్రింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయోమెట్రిక్ అన్నది ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలకు మాత్రమే తీసుకుంటారు. అయితే బాల ఆధార్ తీసుకున్న అనంతరం ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత బయోమెట్రిక్ మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ముందుగా యుఐడిఏఐ వెబ్సైట్ కి వెళ్లి ఆధార్ రిజిస్ట్రేషన్ కోసం లింక్ పై క్లిక్ చేసి, అప్లై ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లల పేర్లు మీ ఫోన్ మొబైల్ నెంబర్ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసిన తర్వాత మీకు దగ్గరలోని ఆధార్ కార్డు సెంటర్ కు అపాయింట్మెంట్ లభిస్తుంది. ఆరోజున అవసరమైన సర్టిఫికెట్స్ తీసుకొని టైమింగ్ ప్రకారం ఆధార్ కార్డు సెంటర్కు వెళ్లి ఆదాము తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆధార్ కార్డు మీ ఇంటికి వస్తుంది.