Site icon HashtagU Telugu

BA Raju: మరాఠీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న బీఏ రాజు కుమారుడు!

Ba Raju

Ba Raju

టాలీవుడ్ లో బెస్ట్ పీఆర్ ఓ ఎవరైనా ఉన్నారంటే.. అది బీఏ రాజు అని చెప్పుకోవాలి. ఆయన ఎన్నో చిత్రాలకు పీఆర్ ఓ గా వ్యవహరించారు. ఆ తర్వాత నిర్మాతగా మారి కొన్ని సినిమాలు కూడా తీశారు. అనారోగ్య సమస్యలతో రాజు చనిపోయారు. ఆయన కుమారుడు డైరెక్టర్‌ శివకుమార్‌ మారాఠీ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో శివకుమార్ పెళ్లి సాదాసీదాగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా శివకుమార్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘పూణెకి చెందిన మరాఠీ అమ్మాయి, నా స్నేహితురాలు దండిగే లావణ్యతో వివాహం జరిగింది. మేం ఇద్దరం కలిసి మా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు కావాలి’ అంటూ శివకుమార్ రియాక్ట్ అయ్యాడు.