Site icon HashtagU Telugu

POCSO Act: బాలికపై మాజీ సీఎం లైంగిక వేధింపులు.. పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు

POCSO Act

yediyurappa

POCSO Act: కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు (POCSO Act) నమోదైంది. 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశారంటూ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 2న తన కుమార్తెను లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో బాధితురాలి తల్లి పేర్కొంది. ఈ క్ర‌మంలోనే క‌ర్ణాట‌క‌ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు బిఎస్ యడియూరప్పపై పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లలకు రక్షణ) చట్టంలోని సెక్షన్ కింద లైంగిక వేధింపుల అభియోగాలు నమోదయ్యాయి.

Also Read: CM Mamata Banerjee: ఆసుప‌త్రి నుంచి సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ డిశ్చార్జ్‌

ది హిందూ ఇచ్చిన నివేదికల ప్రకారం.. సదాశివనగర్ పోలీసులు గురువారం (మార్చి 14) రాత్రి బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్యూరప్ప (81)పై నేరారోపణ చేశారు. 17 ఏళ్ల బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపుల కేసులో నేరం నమోదు చేసినట్లు సమాచారం. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం, 2012 (పోక్సో)ను ఉల్లంఘించినందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిపై కేసు నమోదైంది.

We’re now on WhatsApp : Click to Join

ఓ నివేదిక ప్ర‌కారం.. పోక్సో చట్టంలోని సెక్షన్ 8, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 A కింద నేరం నమోదు చేయబడింది. సీనియర్ పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. బాధితురాలితో పాటు వచ్చిన తల్లి గురువారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయగా, అర్ధరాత్రి దాటిన తర్వాత కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారులు ధృవీకరించారు. పోలీసు మూలాల ప్రకారం.. ఫిబ్రవరి 2, 2024న తల్లి, కుమార్తె చీటింగ్ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి సహాయాన్ని కోరేందుకు వెళ్లినప్పుడు లైంగిక వేధింపుల సంఘటన జరిగిందని స‌మాచారం అందుతుంది.