Site icon HashtagU Telugu

AP TDP: రాజకీయ చరిత్రలో ఏ మచ్చ లేని నాయకులు అయ్యన్నపాత్రుడు

Ayyanna

AP TDP: అయ్యన్నపాత్రుడు గారి లాంటి సీనియర్ నాయకులకు స్పీకర్ పదవి దక్కడం ఆనందదాయకమని  తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన స్పీకర్ గా ఎన్నికైనటువంటి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారిని విజయవాడలో కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చంతో సత్కరించిన రాజేంద్రప్రసాద్ మరియు ఇతర నాయకులు కలిశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడారు.

40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ మచ్చ లేని నాయకులు అయ్యన్నపాత్రుడు గారని,ఆయన్ను మేము గురువుగా భావిస్తామని, గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టి వేధించినా కూడా చెక్కుచెదరని మనోధైర్యంతో తెలుగుదేశం పార్టీ కోసం పోరాటాలు చేశారని, ఈ తరం రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవలసిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు  రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో విజయ మిల్క్ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షులు ఏజర్ల వినోద్ రాజ్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజుల పాటి ఫణి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version