Site icon HashtagU Telugu

Ayodhya Ram Mandir : ఘనంగా అయోధ్య రామ మందిర విజయ్ దివస్ ఉత్సవాలు

Ayodhya Ram Mandir Vijay Di

Ayodhya Ram Mandir Vijay Di

అయోధ్యలో రామ మందిరం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవ వేళ కృష్ణ ధర్మ పరిషత్ (Krishna Dharma Parishad)ఆధ్వర్యంలో హైదరాబాద్ లో విజయ్ దివస్ ఉత్సవాలు నిర్వహించారు. కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు టీ అభిషేక్ గౌడ్ (Abhishek Goud)అయోధ్య రామ మందిరం కల సాకారం కావటం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. శతాబ్దాల కాలంగా కోట్లాది హిందువులు ఈ మధుర క్షణాల కోసం వేచి చూసారని చెప్పారు. భారత్ లో నేటి కొత్త కాల చక్రం మొదలైందని, అన్ని మతాలవారు సామరస్యంగా జీవించాలి ఆకాంక్షించారు. మత సామరస్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కృష్ణ ధర్మ పరిషత్ తెలుగు రాష్ట్రాల నుంచి అయిదు లక్షల మందికి ఉచితంగా అయోధ్య రామమందిరం దర్శనం కల్పించాలని నిర్ణయించిందని ప్రకటించారు. krishnadharma.in లోకి లాగిన్ ద్వారా ఆసక్తి కలిగిన వారు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.

We’re now on WhatsApp. Click to Join.

వచ్చే ఎన్నికల్లో మల్కాజ్ గిరి లోక్ సభ సీటు పైన పార్టీ ముఖ్య నేత, బీజేపీ సీనియర్ నాయకులు కే లక్ష్మణ్ కు అభిషేక్ గౌడ్ ఒక అభ్యర్దన చేసారు. బీజేపీకి అంకితమై పార్టీ కోసం నిబద్దతతో పని చేస్తున్న రామ్ యాదవ్ కు మల్కాజ్ గిరి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని కోరారు. తెలంగాణలో బీజేపీకి పూర్తిగా అనుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు. యువతకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మోదీ నాయకత్వం పట్ల అన్ని వర్గాల ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లు గెలిచిందని, ప్రస్తుత వాతవరణం చూస్తుంటే 12కి పైగా సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తుందని వివరించారు. హిందూ వ్యతిరేక పార్టీలు, అవినీతి పార్టీల పైన ప్రజలు ఏహ్య భావంతో ఉన్నారన్నారు. రాము యాదవ్ లాంటి అంకిత భావం ఉన్న వారికి సీటు ఇస్తే యువతకు ప్రాధాన్యతతో పార్టీకి మరింత జోష్ పెరుగుతుందని అభిషేక్ గౌడ్ వివరించారు.

బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ కృష్ణ ధర్మ పరిషత్ ఏర్పాటు పైన అభిషేక్ గౌడ్ ను అభినందించారు. ధర్మ పరిరక్షణ కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయటం ప్రశంసనీయమన్నారు. హిందువుల మనోభావాలను గాయపర్చేలా వ్యవహరిస్తున్న కొన్ని పార్టీల తీరును తప్పు బట్టారు. రాముడి కార్యాన్ని తిరస్కరించిన వారిని ప్రజలు తిరస్కరిస్తారని లక్ష్మణ్ పేర్కొన్నారు. రాముడిని తిరస్కరించిన వారు రాజకీయంగా ముందుకు వెళ్లలేరు. లౌకిక వాదం ముసుగులో అడుగడుగునా కొన్ని పార్టీలు హిందువులను అగౌరపరుస్తన్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. సర్వేజనా సుఖినోభవంతు అనేది సనాతన ధర్మం లక్ష్యమని చెప్పారు. తమిళనాడులో రామాలయాల్లో రామ మందిరం ఉత్సవం జరుపుకోద్దని పిలుపునిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వారికి ఖచ్చితంగా ప్రజలు బుద్ది చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో రాముడి భజనలు, కీర్తనలతో ఆథ్మాత్మిక సందడి కొనసాగింది. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి..జై శ్రీరామ్ నినాదాలతో భక్తులు పులకరించిపోయారు.

Read Also : 101 KG Gold : రామయ్యకు 101 కిలోల బంగారం.. విరాళం ఇచ్చింది ఎవరో తెలుసా?