Site icon HashtagU Telugu

Ayodhya Temple-3 Idols : అయోధ్య రామమందిరం కోసం 3 విగ్రహాలు.. తయారీ వివరాలివీ

Ayodhya Ram Temple

Ayodhya Ram Temple

Ayodhya Temple-3 Idols : అయోధ్య రామమందిరంలో వచ్చే ఏడాది జనవరి 14 లేదా 15న (మకర సంక్రాంతి రోజున) రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. సంక్రాంతి నుంచి 10 రోజులపాటు రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతాయి. స్వయంగా ప్రధానమంత్రి  నరేంద్రమోడీ చేతుల మీదుగా రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరుగనుంది. జనవరి 24 నుంచి భక్తుల కోసం రామమందిరాన్ని తెరుస్తారు. ఈవివరాలను రామమందిర నిర్మాణ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.

జనవరి 22న  రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన ?

రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన తేదీ  కోసం దేశంలోని పలువురు  ప్రముఖ జ్యోతిష్యులను  శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర  ట్రస్ట్  సంప్రదించింది. ప్రముఖ జ్యోతిష్యులు..  జనవరి 21, 22, 24, 25 తేదీలలో శుభ ముహూర్తాలు ఉన్నాయని సూచించారు. ట్రస్ట్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం..  రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జనవరి 22న జరిగే అవకాశం ఉంది. అంటే ఆ రోజున రామ్ లల్లా విగ్రహాన్ని అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రధాని మోడీ ప్రతిష్టించే ఛాన్స్ ఉంది.  గర్భగుడి ప్రధాన ద్వారంపై, ఆలయంలోని 161 అడుగుల ఎత్తైన గోపురంపై  బంగారు పూత ఉంటుందని రామమందిర నిర్మాణ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా తెలిపారు.

Also read : Electric Vehicles: వచ్చేది వర్షాకాలం.. ఎలక్ట్రిక్ వాహనాలు వాడే వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

మైసూరు నల్లరాళ్లతో రెండు విగ్రహాలు.. మక్రానా పాలరాతితో మరో విగ్రహం 

” అయోధ్యలోని రామ మందిరం కోసం 3 రామ్ లల్లా విగ్రహాల(Ayodhya Temple-3 Idols) తయారీ పనులను ఇప్పటికే ప్రారంభించాం. కర్ణాటకలోని మైసూరుకు చెందిన రెండు నల్లరాళ్లతో రెండు విగ్రహాలు, రాజస్థాన్‌కు చెందిన మక్రానా పాలరాతితో మరో విగ్రహాన్నితయారు చేయిస్తున్నాం. ఈ విగ్రహాలను పూర్తిగా సిద్ధం చేసేందుకు దాదాపు 4 నెలల సమయం పడుతుంది. శిల్పి అరుణ్ యోగిరాజ్, కర్ణాటక హస్త కళాకారుడు గణేష్ ఎల్. భట్, రాజస్థాన్ హస్తకళాకారుడు సత్యనారాయణ పాండే ఈ పనులు చేస్తున్నారు. తలపై కిరీటం, చేతిలో విల్లు, బాణంతో రామ్ లల్లా విగ్రహాలు ఉంటాయి. రామ్ లల్లా విగ్రహం 51 అంగుళాల సైజులో ఉంటుంది.  అయితే ఈ 3 విగ్రహాల్లో దేన్ని గర్భగుడిలో ప్రతిష్టించేందుకు ఎంపిక చేస్తారనేది ఇంకా ఖచ్చితంగా తెలియదు” అని  రామమందిర నిర్మాణ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా  వివరించారు.