Site icon HashtagU Telugu

Chandrababu Arrest Effect : అవినాష్ రెడ్డి బెయిల్ విచారణ పొడిగింపు

Avinash Reddy Bail

Avinash Reddy Bail

వైఎస్ వివేకానందరెడ్డి హత్య (YS Viveka Murder Case ) కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) బెయిల్ (Bail) రద్దు విచారణ వాయిదా పడింది. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు.. ఆయనకు మే 31న ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ సునీతారెడ్డితో పాటు సీబీఐ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

అవినాష్ రెడ్డి బెయిల్ పై ఉంటే సాక్ష్యుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని ఇద్దరూ వాదించారు. ఈ తరుణంలో ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో సునీతారెడ్డి తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ సిద్ధార్ద్ లూథ్రా (Sidharth Luthra) ఏపీలో చంద్రబాబు కేసుతో బిజీగా ఉండటంతో అందుబాటులో లేకుండా పోయారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపిన సునీతారెడ్డి.. కేసు విచారణ వాయిదా వేయాలని కోరారు. దీంతో ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. మూడు వారాలకు విచారణ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు వారాల తర్వాత నాన్ మిస్లీనియర్ డే రోజున ఈ కేసు విచారణ చేపట్టే అవకాశముంది.

Read Also : TDP vs YCP : జ‌గ‌న్ జేబు సంస్థ సీఐడీ : టీడీపీ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌

ఇదిలా ఉంటె ఎంపీ అవినాష్ అరెస్ట్ విషయంలో సిబిఐ తీరు పట్ల టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. బాబాయ్‌ను హత్య చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నా.. అవినాష్‌రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ధికపరమైన కేసులో ఆరోపణలు ఉంటేనే అరెస్ట్ చేసిన పోలీసులు.. హత్య కేసులో స్పష్టమైన ఆధారాలు ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదో వైసీపీ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్న సూక్తి అవినాష్ రెడ్డి విషయంలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నిస్తున్నారు.