Avatar 2 The Way Of Water : అవతార్ 2 కు పైరసీ దెబ్బ..!

‘ద వే ఆఫ్ వాటర్’ (The Way Of Water) పేరుతో డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

జేమ్స్ కామెరూన్ (James Cameron) దర్శకత్వం వహించిన ‘అవతార్’ (Avatar) హాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. 13 ఏళ్ల క్రితం వచ్చిన ఈ విజువల్ వండర్ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కి అన్ని భాషల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. దీనికి కొనసాగింపు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇన్నేళ్లకు ‘అవతార్ 2’ (Avatar 2) వస్తోంది. ‘ద వే ఆఫ్ వాటర్’ (The Way Of Water) పేరుతో డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇంగ్లిష్ తో పాటు పలు భారతీయ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. ఏకంగా 160 భాషల్లో రిలీజ్ అవుతోంది.

భారత్ (India) లో హిందీ (Hindi), తెలుగు (Telugu), తమిళ (Tamil), కన్నడ (Kannada), మలయాళ (Malayalam) భాషల్లో విడుదలవుతోంది. సినిమా శుక్రవారం విడుదల అవుతుండగా, బాక్సాఫీసు వద్ద భారీ సందడి నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్ లో రూ.20 కోట్ల విలువైన టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ తరహా రికార్డు ఈ ఏడాది కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర తదితర చిత్రాలకే సాధ్యమైంది. గురువారం రాత్రి నాటికి రూ.20 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ లు జరిగినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ఈ ఏడాది టాప్ 5 అడ్వాన్స్ కలెక్షన్లలో ఇది కూడా ఒకటి. అయినా కానీ, కేజీఎఫ్ చాప్టర్ 2 రూ.80 కోట్ల కంటే చాలా దిగువనే ఉంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఐమ్యాక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్ రూ.2,500-3,000 కూడా అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. శుక్రవారం తొలి రోజు దేశవ్యాప్తంగా ‘అవతార్ 2’ (Avatar 2) సినిమా రూ. 40-50 కోట్లను వసూలు చేసుకుంటుందని అంచనా. మరే హాలీవుడ్ సినిమాకు భారత్ లో ఈ ఘనత సాధ్యపడలేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సానుకూల అభిప్రాయాలు, రివ్యూలు వస్తుండడంతో, ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది.

అయితే, ఈ చిత్రం మరొక రోజులో థియేటర్లలో సందడి చేయనుందనగా.. చిత్రబృందానికి పైరసీ దారులు షాకిచ్చారు. గురువారమే ఈ చిత్రాన్ని లీక్ చేశారు. మొత్తం చిత్రాన్ని ఆన్ లైన్ లో పెట్టారు. లండన్ లో ఈ నెల 6వ తేదీనే విడుదల కావడంతో ఈ చిత్రం కాపీని టెలీగ్రామ్ (Telegram) తో పాటు టోరెంట్ (Torrent) సైట్లలో అందుబాటులో ఉంచారు. దాంతో, పలువురు దీన్ని డౌన్ లోడ్ (Download) చేసుకొని ఉచితంగా చూస్తున్నారు. చిత్రం లింక్స్ ను సోషల్ మీడియా (Social Media) ప్లాట్ ఫామ్స్ లో షేర్ చేస్తున్నారు. అయితే గ్రాఫిక్స్ ఆధారిత చిత్రం కనుక థియేటర్లలో చూసిన అనుభవం ఫోన్లలో, కంప్యూటర్లలో చూసినప్పుడు ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read:  Yoga for Your Healthy Heart : మీ గుండె క్షేమంగా ఉండాలంటే…