Site icon HashtagU Telugu

Mumbai: విద్యార్థిని కిడ్నాప్ కు ఆటో డ్రైవర్ యత్నం…విద్యార్థిని అడ్డుకోవడంతో..!!

Mumbai

Mumbai

మహారాష్ట్రలోని థానే ప్రాంతంలో ఓ కాలేజీ విద్యార్థినిని బలవంతంగా తన ఆటోలో ఎక్కించేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించాడు. విద్యార్థిని అడ్డుకోవడంతో ఆటో డ్రైవర్ ఆమెను కదులుతున్న ఆటోలో సుమారు 500 మీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. ఆ విద్యార్థిని ఆటో డ్రైవర్ కు చిక్కకుండా ఆత్మస్థైర్యంతో అడ్డుకుంది. దీంతో ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వార్తా సంస్థ ANI ప్రకారం.. ఈ ఘటన శుక్రవారం జరిగింది. విద్యార్థిని కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచిచూస్తుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆటో డ్రైవర్ ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అంతటితో ఊరుకోకుండా విద్యార్థిని బలవంతంగా ఆటోలో ఎక్కించే ప్రయత్నం చేశాడు. ఆ విద్యార్థిని అడ్డుకోవడంతో..చేయి పట్టుకుని ఆటోను వేగంగా 500మీటర్ల మీర ఈడ్చుకెళ్లాడు. ఆటో డ్రైవర్ ను కిందికి లాగే ప్రయత్నం చేసింది విద్యార్థిని. దాంతో ఆటో డ్రైవర్ చేయి వదిలి పరారయ్యాడు. ఈ ద్రుశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై ఐపీసీ 354కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నాయి.