Site icon HashtagU Telugu

Cabs Strike: క్యాబ్స్, ఆటో, లారీల ‘బంద్’

Cabs

Cabs

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ ‘ఆటో, క్యాబ్‌లు, లారీ యూనియన్ల’ సంయుక్త కార్యాచరణ కమిటీ గురువారం (మే 19) రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్ భవన్‌ను గురువారం ముట్టడించాలని ఆటోలు, క్యాబ్‌లు, లారీల డ్రైవర్లకు జేఏసీ పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని నాయకులు తెలిపారు.

వాహన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఆలస్యమైతే రోజుకు రూ.50 పెనాల్టీ వసూలు నిలిపివేయాలని, కొత్త మోటారు వాహన చట్టం-2019 అమలును రద్దు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది.ఆలస్యానికి రూ.50 జరిమానా విధించి ఆన్‌లైన్ ద్వారా వేల రూపాయల బకాయిలు చూపడం సరికాదు. వాహనం ఫిట్‌నెస్, గత ఎనిమిదేళ్లుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితర నిత్యావసర వస్తువుల ధరలు 100 శాతం పెరిగినా ఆటో మీటర్ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. ఇంధన ధరలను జీఎస్టీ పరిమితిలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని యూనియన్ నాయకులు కోరారు.