Site icon HashtagU Telugu

Australia Withdraw ODI Series: ఆఫ్ఘనిస్థాన్‌కి బిగ్ షాక్.. వన్డే సిరీస్‌ను రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా

AFG

Resizeimagesize (1280 X 720) 11zon

ఆఫ్ఘనిస్థాన్‌ (Afghanistan)తో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా (Australia) క్రికెట్ బోర్డు (CA) నిరాకరించింది. ఈ సిరీస్ మార్చి నెలాఖరులో యూఏఈలో జరగాల్సి ఉంది. కానీ తాలిబన్ల కొన్ని నిర్ణయాలకు నిరసనగా ఆస్ట్రేలియా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్ ఆడటానికి నిరాకరించింది. నిజానికి ఫిబ్రవరిలో జరిగే భారత పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు నాలుగు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. దీని తర్వాత UAEలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో మూడు ODIల సిరీస్ కూడా షెడ్యూల్ చేయబడింది.

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ పాలన ఉంది. దేశంలో మహిళలు, బాలికలపై ఎన్నో ఆంక్షలు విధించారు. చదువుతో పాటు ఇంటి బయట పనిచేసే హక్కు కూడా మహిళలకు లేదు. ఆడపిల్లలు కూడా క్రీడల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. తాలిబన్ల ఈ నిర్ణయానికి నిరసనగా క్రికెట్ సిరీస్ ఆడకూడదని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా బోర్డు తన ప్రకటనలో పేర్కొంది.

Also Read: ICC T20 Rankings: సూర్యా భాయ్.. ఆకాశమే హద్దుగా

బోర్డు ఆస్ట్రేలియా విడుదల చేసిన ఒక ప్రకటనలో.. ఆఫ్ఘనిస్తాన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా మహిళలు, పురుషులను క్రీడలకు,వారి అభివృద్ధికి తీసుకురావడానికి CA కట్టుబడి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పురుషుల జట్టుకి పూర్తి సపోర్ట్ ప్రకటించిన తాలిబన్లు, ఆఫ్ఘాన్ మహిళల జట్టును నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2021 చివర్లోనే పురుషులతో క్రికెట్ ఆడాలంటే మహిళా క్రికెట్‌పై విధించిన బ్యాన్ ఎత్తివేయాలని ఆఫ్ఘాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా.

అయితే తాలిబన్లు మాత్రం మహిళలు క్రీడలు ఆడుకోవడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చి చెప్పేశారు. ఆఫ్ఘాన్ క్రికెట్ మహిళా టీమ్‌పై నిషేధం పడడంతో ఐసీసీలో పూర్తి సభ్యత్వం కలిగిన జట్లలో మహిళా టీమ్ లేని బోర్డుగా ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు నిలిచింది. ఈ నెలలో ప్రారంభమయ్యే మొట్టమొదటి ఐసీసీ అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఆఫ్ఘాన్ మహిళా జట్టు పాల్గొనడం లేదు. CA తన మద్దతు కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలిపింది. మా నిర్ణయానికి (ఆఫ్ఘనిస్తాన్ నుండి సిరీస్‌ను రద్దు చేయడం) మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) సీఈఓ జియోఫ్ అల్లార్డిస్ కూడా ఆఫ్ఘనిస్తాన్‌ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.