PM With PM: పీఎం మోడీతో ఆస్ట్రేలియా పీఎం సెల్ఫీ.. ఫొటో వైరల్!

ప్రధాని మోడీతో తీసుకున్న సెల్ఫీని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సోషల్ మీడియా లో పంచుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Pm Selfi

Pm Selfi

ఇండియా, ఆస్ట్రేలియా 4వ టెస్ట్ మ్యాచ్ చాలా ఆసక్తిగా మారింది. రెండు దేశాల ప్రధానులు స్వయంగా ఈ మ్యాచ్ కు అటెండ్ కావడమే అందుకు కారణం. ఇద్దరు ప్రధానులు టీమిండియా క్రికెటర్లతో సందడి చేసి ఆకట్టుకున్నారు. అయితే అహ్మదాబాద్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టును చూస్తున్నప్పుడు ప్రధాని మోడీ (Narendra Modi)తో తీసుకున్న సెల్ఫీని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సోషల్ మీడియా లో పంచుకున్నారు. “భారత ప్రధాని నరేంద్ర మోడీతో క్రికెట్ ద్వారా 75 సంవత్సరాల స్నేహాన్ని జరుపుకుంటున్నాను” అని క్యాప్షన్ రాశారు.

  Last Updated: 09 Mar 2023, 01:16 PM IST