Site icon HashtagU Telugu

CBI: ఆరో తేదీన విచారణకు హాజరవ్వండి : ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు

Mlc Kavitha

Mlc Kavitha

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సిఆర్‌పిసిలోని 160 సెక్షన్‌ కింద సిబిఐ (ఎసిబి) డిప్యూటీ సూపరింటెండెంట్‌ అలోక్‌ కుమార్‌ షా పేరుతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈనెల ఆరో తేదీన హైదరాబాద్‌లోగానీ, ఢిల్లీలోగానీ సిబిఐ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో కోరారు.

ఢిల్లీలో బయట పడ్డ మద్యం పాలసీకి సంబంధించిన స్కామ్‌లో విచారణ సందర్భంగా 14 మంది పేర్లు వచ్చాయని ఇందులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి కొంత వివరణను ఇవ్వడానికి గానూ తమ ఎదుట హాజరు కావాలని కవితను ఈ నోటీసులో సిబిఐ కోరింది. అయితే, నోటీసులపై స్పందించిన కవిత.. విచారణకు హైదరాబాద్‌లోని తమ నివాసానికే రావాల్సిందిగా సిబిఐకి సమాచారమిచ్చారు.

CBI letter