Site icon HashtagU Telugu

Uttar Pradesh: యూపీలో దారుణం.. ఇద్దరు చిన్నారులపై గొడ్డలితో దాడి

Crime

Crime

Uttar Pradesh: యూపీలోని బదౌన్ లో ఘోరం జరిగింది. ఓ సెలూన్ షాపు యజమాని సాజిద్ .. ఇద్దరు చిన్నారులను అతికిరాతకంగా గొడ్డలితో నరికిచంపాడు. అనంతరం ఆ బార్బర్ ను పోలీసులు కాల్చి చంపారు. సాజిద్ ఇటీవలే స్థానికంగా సెలూన్ షాపు ప్రారంభించినట్లు తెలిసింది. షాపు ఎదురుగా ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లిన సాజిద్ .. ఆయుష్ , అహాన్ , యువ్ రాజ్ అనే ముగ్గురు 12 ఏళ్ల లోపు పిల్లలపై దాడి చేశాడు. వారిని భవనం పైకి తీసుకెళ్లి ఇద్దరిని గొడ్డలితో నరికిచంపాడు. దాడిలో గాయపడ్డ యువ్ రాజ్ తృటిలో తప్పించుకున్నాడు. దాడి సమయంలో ఆ చిన్నారుల తల్లి మాత్రమే ఇంట్లో ఉన్నట్లు తెలిసింది.

తన భార్య కడుపుతో ఉందని, చికిత్సకు 5వేల రూపాయలు కావాలని అడగ్గా.. ఆమె ఆ మొత్తాన్ని అప్పుగా సాజిద్ కు ఇచ్చింది. టీ తెస్తానని ఆమె లోపలికి వెళ్లగానే.. సాజిద్ ఈ హత్యలకు పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయిన నిందితుడు.. ఓ అటవీ ప్రాంతంలో నక్కాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సాజిద్ ను పట్టుకునేందుకు వెళ్లగా.. వారిపై దాడి చేశాడు. దీంతో పోలీసులు సాజిద్ ను కాల్చిచంపారు. వ్యక్తిగత కక్షలే కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత బాధితుల బంధువులు.. సాజిద్ బార్బర్ షాపుపై దాడి చేసి ధ్వంసం చేశారు

Exit mobile version