Son Killed Father: తుర్కయంజాల్‌లో దారుణం.. క‌న్న‌తండ్రిని హ‌త‌మార్చిన కొడుకు

తుర్క‌యంజాల్‌లో దారుణం చోటుచేసుకుంది. మంద‌లించినందుకు క‌న్న‌తండ్రిని ఓ కొడుకు (Son Killed Father) హ‌త‌మార్చాడు.

Published By: HashtagU Telugu Desk
Son Killed Father

Crime Scene

Son Killed Father: తుర్క‌యంజాల్‌లో దారుణం చోటుచేసుకుంది. మంద‌లించినందుకు క‌న్న‌తండ్రిని ఓ కొడుకు (Son Killed Father) హ‌త‌మార్చాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. డ్రగ్స్‌కు బానిసగా మారిన కొడుకును కన్న తండ్రి మంద‌లించాడు. దీంతో తండ్రిపై కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య కొడుకు అనురాగ్ తండ్రిని హ‌త్య చేశాడు. ఆదిభట్ల తుర్కయంజాల్‌లోని ఆరెంజ్ అవెన్యూలో ఘటన జ‌రిగింది. అనురాగ్ తండ్రి రవీందర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. రెండు నెలల‌ క్రితం తుర్కయంజాల్‌లో కొత్త ఇల్లు కొని అక్కడే నివాసం ఉంటున్నాడు.

నాగర్ కర్నూల్‌కు చెందిన రవీందర్ మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య పెద్ద కుమారుడు అనురాగ్ జులాయిగా తిరుగుతూ డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. అనురాగ్ పై పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు న‌మోదుకావ‌డంతో జైలుకు వెళ్లి రావడంతో తండ్రి రవీందర్ మంద‌లించాడు. డ్రగ్స్ కు అలవాటు అయిన అనురాగ్‌ను రిహాబిలిటేషన్ సెంటర్ లో చేర్పించిన అతనిలో మార్పు రాలేదు. రెండు రోజుల క్రితమే పెట్రోల్ కొనుకొచ్చి ఇంట్లో ఉంచాడు అనురాగ్. గుర‌వారం సాయంత్రం తండ్రి రవీందర్ తో గొడవకు దిగిన అనురాగ్ తండ్రిపై దాడి చేశాడు. అనురాగ్ నుండి తప్పించుకొని రోడ్డుపైకి పరిగెత్తాడు తండ్రి రవీందర్.

Also Read: SRH vs CSK: నేడు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ చెన్నై సూప‌ర్ కింగ్‌.. ఏ జ‌ట్టుది పైచేయి అంటే..? 

వెంబడించి వెళ్లిన అనురాగ్ తండ్రి పై పెట్రోల్ పోసి నిప్పంటించి, బండరాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనురాగ్.. హత్య తర్వాత అక్కడి నుండి పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి అనురాగ్ కోసం గాలిస్తున్నారు. రవీందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హత్య చేసిన అనురాగ్ కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 05 Apr 2024, 10:18 AM IST