Site icon HashtagU Telugu

Crime: హన్మకొండలో దారుణం.. విద్యార్థిని గొంతు కోసిన యువకుడు

Crime

అమ్మాయిల రక్షణ కోసం కఠిన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ, ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకు రెచ్చిపోయి దాడులు చేస్తున్నారు. తాజాగా హ‌నుమ‌కొండలోని గోపాల‌పూర్‌లో త‌న‌ను ప్రేమించాలంటూ ఓ విద్యార్థిని (23) వెంటపడుతున్న అజ‌హ‌ర్ అనే యువ‌కుడు ఇంటికెళ్లి దాడి చేశాడు. కత్తితో బెదిరించి విద్యార్థిని గొంతు కోసి పారిపోయాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అమ్మాయిని  స్థానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. విద్యార్థిని ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా యువతి కాక‌తీయ యూనివ‌ర్సిటీలో ఎంసీఏ చ‌దువుతోంది. అయితే ప్రేమ పేరుతో అజ‌హ‌ర్ వేధిస్తున్నాడ‌ని, అత‌డిని ఆమె నిరాక‌రిస్తుండ‌డంతో ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడ‌ని పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే హైదరాబాద్ తర్వాత విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు వరంగల్ అడ్డాగా మారుతోంది. ముఖ్యంగా ఎన్నో విద్యాలయాలున్నాయి. చదువుల నిమిత్తం ఎంతోమంది అమ్మాయిలు వరంగల్ కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రుల్లో భయం నెలకొంది.