ATM Charges: ఏటీఎం కొత్త చార్జీలు..డబ్బులు డ్రా చేసిన ప్రతిసారి రూ.21 చెల్లించాలట?

ఈ మధ్యకాలంలో ఏటీఎం కార్డు వినియోగం పూర్తిగా పెరిగిపోయింది. దీంతో ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు

  • Written By:
  • Updated On - October 1, 2022 / 11:17 PM IST

ఈ మధ్యకాలంలో ఏటీఎం కార్డు వినియోగం పూర్తిగా పెరిగిపోయింది. దీంతో ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు ఏటీఎం ఎందుకు వెళ్లి కావాల్సింది డబ్బులు డ్రా చేసుకుని వస్తున్నారు. ఇలా నెలకు పదుల సంఖ్యలో అమౌంట్ ని డ్రా చేస్తున్నారు. అయితే ఇలా అమౌంట్ ని తరచుగా తీసుకునే వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే ఏటీఎం చార్జీలు పెరిగాయి. దీనితో ఉచిత లిమిట్ దాటిన తరువాత ప్రతి ఒక్క లావాదేవీ పై 21 రూపాయలు ఛార్జీ పడుతుంది. ఎన్నిసార్లు డబ్బులు తీస్తే అన్ని 21 రూపాయలు చెల్లించాల్సిందే.

ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం చార్జీలు సవరించుకోవచ్చు అని బ్యాంకులకు అనుమతినిచ్చింది. ఇక ఆర్.బి.ఐ సూచన మేరకు బ్యాంకులో వాటి ఏటీఎం చార్జీలను సవరిస్తున్నాయి. ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్,ఐసిఐసిఐ బ్యాంక్ తో పాటుగా పలు బ్యాంకులు వాటి ఏటీఎం చార్జీలను సవరించాయి. ఇకపోతే మామూలుగా బ్యాంకు కస్టమర్లు నెలలో ఏటీఎం నుంచి ఐదు సార్లు ఇటువంటి చార్జీలు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

ఇది ఒకవేళ చార్జీల మూత తప్పించుకోవాలి అనుకున్న వారు చిన్న చిన్న అమౌంట్ కోసం ఏటీఎంలకు వెళ్లకుండా పెద్ద మొత్తంలో కావాల్సినప్పుడు వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవడం మంచిది. అలాకాకుండా నెలకు 5 సార్లు కంటే ఎక్కువసార్లు డబ్బులు డ్రా చేస్తే మాత్రం చార్జిల బాదుడు భరించాల్సిందే మరి. ఇప్పటికే బ్యాంకు కస్టమర్లకు ఆయా బ్యాంకు నుంచి సవరించిన చార్జీల అంశానికి సంబంధించి మెసేజ్లు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇకపై అమౌంట్ ని విత్ డ్రా చేయాలి అనుకున్న వారు ఆలోచించి డ్రా చేయడం మంచిది. లేదంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ పై 21 రూపాయిలు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది.